Health Tips: ఆధునిక జీవన శైలి వలన కలిగే వ్యాధులకు చెక్ పెట్టాలంటే మీ వ్యాయామంలో సైక్లింగ్ ని చేర్చుకోండి. ఇప్పటికే మీరు సైక్లింగ్ చేస్తున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు మీ చెంత ఉన్నట్టే అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీయొక్క వ్యాయామంలో ప్రతిరోజు సైకిల్ ని జత చేర్చండి. సైక్లింగ్ చేయటం వలన ఫిట్నెస్ యొక్క స్థాయి పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది, రక్తప్రసరణ పెరుగుతుంది, కీళ్ల నొప్పులని తగ్గిస్తుంది, కండరాల బలం పెరుగుతుంది,మైండ్ కూడా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది.
26
సైక్లింగ్ ద్వారా మీ మెదడు యొక్క అభిజ్ఞా ప్రక్రియలు మరియు పనితీరుని మెరుగుపరచుకోవచ్చు. కొత్త న్యూరాన్లను సృష్టించటం మరియు విస్తరించటం వల్ల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే రోజూ సైక్లింగ్ చేయటం వలన మీ బరువు పెరగటం తగ్గి అదుపులో ఉంటుంది.
36
మీరు సైక్లింగ్ చేసే సమయాన్ని బట్టి బరువు తగ్గవచ్చు కూడా. రెగ్యులర్ గా సైకిల్ తొక్కడం వల్ల బలమైన కాళ్ళని పొందుతారు. మీ స్టామినా కూడా బాగా పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది.
46
మీరు అల్పాహారం తీసుకునే ముందు ప్రతిరోజు ఉదయం సైక్లింగ్ చేయడం వలన ఒంటిలో ఉండే కొవ్వుని తగ్గించవచ్చు. ఫ్లాట్ సర్ఫేస్ కాకుండా కొంచెం వాలుగా ఉన్న సర్ఫేస్ మీద సైకిల్ తొక్కండి. దీని వలన ఎక్కువ కాలరీలు ఖర్చు అవ్వటమే కాకుండా మీ బరువును కూడా చాలా త్వరగా కోల్పోవచ్చు.
56
అలాగే సైక్లింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా పాటించండి హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకండి సైకిల్ తొక్కేటప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ మరియు ఇంధనం గా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే సైక్లింగ్ రేడ్ కి చాలా శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి రెండు వాటర్ బాటిల్స్..
66
అవసరమనుకుంటే కొన్ని స్నాక్స్ మీతో పాటు తీసుకువెళ్లడం ఉత్తమం. సైకిల్ అనేది శరీరానికి ఎంత ప్రయోజనాన్ని ఇస్తుందో మనసుకి కూడా అంతే ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ మూడ్ బాగోలేనప్పుడు ఒక్కసారి సైక్లింగ్ చేసి చూడండి తేడా మీకే తెలుస్తుంది.