Health Tips: మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అస్సలు బెండకాయ జోలికి పోకండి!

Navya G | Published : Oct 4, 2023 12:09 PM
Google News Follow Us

Health Tips: సాధారణంగా కాయగూరలు ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తాయి కానీ కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల కాయగూరలు తినకూడదు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.
 

16
Health Tips: మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అస్సలు బెండకాయ జోలికి పోకండి!

 బెండకాయని కూరగా చేసుకుని తిన్నా, బెండకాయ వాటర్ తాగిన శరీరానికి ఎంతో మంచిది. అందులోనూ ఆకుపచ్చ రంగు కాయగూరలు ఆరోగ్యానికి మరింత మంచిది అని చెప్తారు డాక్టర్లు. అయితే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి బెండకాయ ఇబ్బందులని తెచ్చిపెడుతుంది.
 

26

 అందుకే ఏ సమస్యలు ఉన్నవారు బెండకాయ తినకూడదో ఇప్పుడు చూద్దాం. రక్తం గడ్డ కట్టే సమస్యలు ఉన్నవారు,అందుకు మందులను వాడేవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే బెండకాయలు తినాలి. ఎందుకంటే బెండకాయ రక్తం గడ్డ కట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ కి కూడా పుష్కలంగా ఉంటుంది.

36

అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయలని ఉడికించి చేసిన కూరలు తినటం ఉత్తమం. బెండకాయ ఫ్రై అనేది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఎందుకంటే బెండకాయలో ఉండే జిగట పోవడానికి చాలా ఎక్కువ మోతాదులో నూనె వాడవలసి వస్తుంది.

Related Articles

46

 దాని వలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. డయాబెటిస్ తో బాధపడేవారు కూడా బెండకాయను అతిగా తినకూడదు. అలాగే కిడ్నీ స్టోన్స్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి ఈ సమస్య ఉన్నవారు పూర్తిగా బెండకాయని తినకపోవడమే మంచిది.
 

56

 అలాగే కడుపులో గ్యాస్, కడుపులో ఉబ్బరం, విరోచనాలు, జీర్ణ కోసం సమస్యలు ఉన్నవారు బెండకాయలను పొరపాటున కూడా తినకూడదు. అలాగే సాధారణ ఎలర్జీ సమస్య ఉన్నవారు కూడా బెండకాయలను అస్సలు తినకూడదు. చాలామందికి కోకో, మందార పువ్వు వంటివి ఎలర్జీని ఇస్తాయి.
 

66

అలాంటివాళ్లు బెండకాయని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి బెండకాయ తినడం అనేది కొత్త ప్రాబ్లం ని సృష్టించే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు దగ్గు, సైనస్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు బెండకాయ తినటం మానుకోండి.

Recommended Photos