వేసవిలో వ్యాయామం.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం తప్పదు..!

First Published Apr 12, 2021, 2:44 PM IST

అందుకే సమ్మర్ లో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

వేసవి జస్ట్ మొదలైంది. కానీ అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. కాసేపు కూడా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేనంతగా ఎండలు మండుతున్నాయి. అలాంటి ఈ వేసవి ఎండలో వ్యాయామం చేయడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
undefined
ఎలాంటి జాగ్రత్తలు లేకుండా సమ్మర్ లో వ్యాయామం చేస్తే.. నీరసం, తలనొప్పి లాంటివి వస్తుంటాయి. మరీ ఎక్కువగా చేయడం వల్ల శరీరం డీ హైడ్రేట్ అయిపోతుంది.
undefined
అందుకే సమ్మర్ లో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
చాలా మంది వ్యాయామం చేసి... గ్లాసుల కొద్దీ నీరు తాగుతుంటారు. అయితే.. నీరు ఒక్కటి తాగితే సరిపోదట. వ్యాయామం చేసినప్పుడు వచ్చే చెమట ద్వారా ఎలక్ట్రోలైట్స్, నీరు, ఉప్పు బయటకు వచ్చేస్తాయి. ఎలక్ట్రోలైట్స్ అంటే.. మినరల్స్ అని అర్థం. చెమట రూపంలో మనం మినరల్స్ కోల్పోతున్నాం. కాబట్టి.. మళ్లీ వాటిని పొందడం చాలా అవసరం.
undefined
ఈ వ్యాయామం చేసే సమయం చాలా ముఖ్యం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఆ సమయంలో వ్యాయామం చేయడం కరెక్ట్ కాదు.. ఉదయాన్నే.. సూర్యుడు రాకముందు చేయడం ఉత్తమమైన మార్గం. లేదంటే సాయంత్రం 6 తర్వాత చేసుకోవడం కూడా మంచిదే.
undefined
వ్యాయామం చేసే సమయంలో బిగుతు దుస్తులు వేసుకోకూడదు. కొద్దిగా వదులుగా ఉండేవి.. లేత రంగు దుస్తులు వేసుకోవాలి.ముదురు రంగులు వేడిని పీల్చుకుంటాయి. కాబట్టి లైట్ కలర్స్ వేసుకోవాలి. బిగుతు బట్టలు వేసుకుంటే.. ఊపిరాడదు. చెమట కారణంగా చిరాకుగా కూడా ఉంటాయి.
undefined
వ్యాయామం ఇంట్లో కాకుండా బయట వాతావరణంలో చేసే అలవాటు ఉంటే.. సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు. లేంటే స్కిన్ ట్యాన్ అయిపోతుంది.
undefined
click me!