Fertility:ఈ అలవాట్లే మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి..

First Published | Feb 3, 2022, 3:54 PM IST


Fertility: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సంతానోత్పతత్తి సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాదు పిల్లలు పుట్టకపోవడంతో భార్యభర్తల మధ్య ఎన్నో తగాదాలు, కొట్లాటలు వస్తున్నాయి. తద్వారా ఆ భార్య భర్తలు విడాకులు తీసుకునే వరకు వెళుతున్నారు. 

Fertility: పెళ్లైన కొన్నేళ్ల వరకు భార్య భర్తలు బాగానే  ఉన్నా.. కొన్నాళ్ల తర్వాత పిల్లలు కావాలనిపిస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత పిల్లలు పుడితేనే ఆ వివాహ బంధానికి పూరిపూర్ణత్వం లభిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఎంతైనా పెళ్లైనా తర్వాత పిల్లలు పుడితేనే కదా.. ఆ బంధం పరిపూర్ణం అయ్యేది. అయితే ప్రస్తుతం చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. భార్య భర్తల్లోని ఏ ఒక్కరికీ ఏ కొంచెం లోపమున్నా.. పిల్లలు పుట్టడానికి అవకాశముండదు. కానీ కొంతమందిలో ఎలాంటి లోపాలు లేకున్నా గర్భం దాల్చలేకపోతున్నారు. దీనివల్ల కొంత మంది హాస్పటల్ల చుట్టూ తిరిగితే.. మరికొంతమంది గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతుంటారు. కానీ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న సంగతి మర్చిపోకండి. కొన్ని అలవాట్లను మార్చుకుంటే మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఇట్టే పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 

స్మోకింగ్: సిగరేట్ తాగడం వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే సిగరేట్ తాగడం వల్ల సర్వరోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అయినా ప్రతిరోజూ సిగరేట్ తాగేవారి సంఖ్య బాగానే ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సిగరేట్ తాగే మగవారిలో అంగస్తంభన లోపం ఏర్పడుతుంది. అంతేకాదు వీర్య కణాల (Sperm cells) సంఖ్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్పెర్మ్ చురుగ్గా కదల్లేవు. మొత్తంగా  Fertilization capacity తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 



మధ్యపానం:  ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. దీన్ని తాగడం వల్ల శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆల్కహాల్ సంతానోత్పతికి అడ్డుగా నిలుస్తుంది. ఇది పునరుత్పత్తిని తగ్గించడమే కాదు.. పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టుకుండా కూడా చేస్తుంది. అంతేకాదు ఇది పునరుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
 


బరువు:  ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. ఇది చాలా చిన్న సమస్య అనిపించినప్పటికీ.. గర్బం దాల్చడంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భార్యా భర్తల్లో ఎవరు అధిక బరువున్నా.. గర్భం దాల్చడం కష్టమే. శరీర బరువు ఎక్కువ ఉన్నవారిలో బోన్స్ సంబంధిత సమస్యలు రావడంతో పాటుగా గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది. 
 

అసాధారణమైన లైంఘిక పద్దతుల వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. కాగా సెక్స్ పద్దతులు ఆహ్లాదకరంగా, సురక్షింతంగా ఉన్నప్పుడే గర్భంధరించే అవకాశముంటుంది. అంతేకాని అసాధారణ సెక్స్ పద్దతుల వల్ల గర్భం దాల్చడం పక్కన పెడితే.. ఇన్నో వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. 
 

అలసిన శరీరానికి కంటినిండా నిద్ర ఎంతో అవసరం. నిద్రతోనే మన శరీరం తిరిగి పునరుత్తేజంగా మారుతుంది. ఒక వేళ మీరు నిద్రకు దూరమైతే.. ఒత్తిడి పెరగడం, హార్మోన్లు హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఫలితంగా మీరు సెక్స్ లైఫ్ అంతగా బాగుండదు. కాగా ఆడవారిలో నిద్రలేమి సమస్య ఉంటే వారిలో పునరుత్పత్తి వ్యవస్థపై (Reproductive system) తీవ్ర ప్రభావం పడుతుంది. తద్వారా కూడా గర్భం దాల్చలేరు. 

Latest Videos

click me!