పీరియడ్స్ సమయంలో తీసుకునే ఆహార పదార్థాలలో ఇవి తప్పనిసరి.. లేకుంటే?

First Published Jan 5, 2022, 1:00 PM IST

ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారంలో పోషకాల లోపం (Nutrient deficiency) కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి చిన్న వయసులోనే అమ్మాయిలకు రుతుస్రావం (Menstruation) జరుగుతోంది. ఇలా పిరియడ్స్ వచ్చినప్పుడు ఆ సమయంలో వారు నీరసంగా, చికాకుగా కనిపిస్తారు. ఏ పదార్థాలను తినడానికి పెద్దగా ఇష్టపడరు. మరి వారికి శక్తి ఎలా లభిస్తుంది! ఎలాంటి ఆహార పదార్థాలు వారికి  పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

రుతుస్రావం మొదలైన అమ్మాయిలలో హార్మోన్లలో అసమతుల్యత రక్తహీనత (Anemia), నీటి శాతం తగ్గడం, జీర్ణక్రియలో మార్పులు (Changes in digestion) చోటు చేసుకుంటాయి. ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ లో ఒక్కొక్కసారి తీవ్రమైన కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి. వీటి కారణంగా అమ్మాయిలలో చికాకు, కోపం, ఆందోళన వంటి సమస్యలు ఏర్పడతాయి.
 

వారి శరీరంలోని మార్పును (Change in the body) వారు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కనుక తల్లులు వారికి అండగా ఉంటూ వారికి అందించే ఆహార పదార్థాలలో ప్రత్యేక శ్రద్ధ (Special attention) తీసుకోవడం తప్పనిసరి. పీరియడ్స్ సమయంలో ఆహారం తినాలనిపించదు. ఆ సమయంలో జీర్ణక్రియ పనితీరు నెమ్మది పడుతుంది.
 

కనుక వారికి అందించే ఆహారంలో ఎక్కువగా పండ్లరసాలు, సోయా, ఫ్లేవర్డ్ మిల్క్ (Flavored Milk) వంటివి ఉండేలా చూడాలి. ఇవి శరీరం కోల్పోయిన నీటి శాతాన్ని, కేలరీలను భర్తీ చేస్తాయి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం (Excessive bleeding) కారణంగా నీరసం వస్తుంది. అలాంటప్పుడు  ఆకుకూరలు, నువ్వులు, పల్లీల లడ్డు, చిక్కి, రోస్టెడ్ నట్స్ వంటివి ఇవ్వండి.
 

వీటిని తీసుకుంటే శరీరంలో ఐరన్ లెవెల్స్ (Iron levels) పెరుగుతాయి. పీరియడ్స్ సమయంలో ఒత్తిడిగా (Stress) ఉంటే అల్లం టీ తిని తీసుకుంటే మంచిది. అల్లం టీ తలనొప్పి, డయేరియా వంటి సమస్యలను తగ్గించి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ సమయంలో అమ్మాయిలకు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను అందించాలి.
 

అప్పుడే వారి కడుపు మీద ఒత్తిడి పడకుండా కడుపు నొప్పి (Abdominal pain) నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే నిమ్మరసం, తేనే కలిపిన నీళ్ళు, వెజిటేబుల్స్ సూప్స్, కొబ్బరినీళ్లు రెండు గంటలకు ఒకసారి అమ్మాయిలకు ఇవ్వాలి. డార్క్ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కనుక డార్క్ చాక్లెట్ (Dark chocolate) ను పీరియడ్స్ సమయంలో తీసుకుంటే  తాత్కాలిక రిలీఫ్ లభిస్తుంది.
 

అమ్మాయిలకు నచ్చిన ఆహారాన్ని ఇవ్వచ్చు. పీరియడ్స్ సమయంలో ఒకేసారి ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకోరాదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. స్నాక్స్ రూపంలో వారికి కార్న్ ఫ్లేక్స్ (Corn Flakes), రాగి ఫ్లేక్స్ అండ్ మిల్క్, డేట్స్ (Dates), ఉడకబెట్టిన పల్లీలు, స్వీట్ కార్న్, రాగి లడ్డు వంటివి ఇవ్వచ్చు.
 

ఇలా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే అమ్మాయిలలో నీరసం (Boring) తగ్గి పోతుంది. అయితే పిరియడ్ సమయంలోనే కాకుండా మిగిలిన రోజులు కూడా మంచి పోషకాలు కలిగిన మాంసకృత్తులు (Proteins), బీ-కాంప్లెక్స్ ఉండే పదార్థాలను ఇవ్వాలి.

click me!