Mobile Addiction: ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటే క్యాన్సర్ వస్తుందా?

Published : Feb 13, 2025, 01:14 PM ISTUpdated : Feb 13, 2025, 03:07 PM IST

చాలామందికి ఫోన్ దిండు కింద పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. ఇంకా యూత్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఫోన్ చూస్తూ చూస్తూనే నిద్రపోతారు. మరి ఇలా ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ఏదైన ప్రమాదమా? అలా పడుకోవచ్చా? ఇక్కడ తెలుసుకోండి. 

PREV
15
Mobile Addiction: ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటే క్యాన్సర్ వస్తుందా?

ప్రస్తుతం చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలోనే ఉంటుంది. కొందరైతే పడుకునేటప్పుడు దిండు కిందగాని, పక్కనగాని పెట్టుకొని పడుకుంటారు.

25
రేడియేషన్

చాలా మందికి దిండు దగ్గర ఫోన్ పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. ఇది ప్రమాదకరమని చాలామంది మనకి సలహా ఇస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే ఫార్వర్డ్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. మరి నిజంగా అలా జరుగుతుందా? ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అంత హానికరమా? ఇక్కడ చూద్దాం.

35
ప్రమాదమా?

దిండు దగ్గర ఫోన్ పెట్టుకుంటే పెద్దగా హాని జరగదు. సోషల్ మీడియాలో చెప్పినంత ప్రాణాంతకం కాదు. ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ తక్కువ శక్తి కలిగి ఉంటుంది. మన జన్యువులను లేదా శరీరంలోని కణాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే శక్తి వీటికి లేదు. దిండు దగ్గర ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ వల్ల చనిపోతారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. 

ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఎక్కువసేపు ఫోన్ వాడితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ రెండూ ఫోన్ రేడియేషన్, మెదడుకు హాని కలిగిస్తుందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కనుగోలేదట.

45
క్యాన్సర్ కు కారణమా?

ఫోన్ల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ గత 20 ఏళ్లలో వైర్‌లెస్ టెక్నాలజీ విస్తృతంగా వ్యాపించిన తర్వాత కూడా బ్రెయిన్ క్యాన్సర్ కేసులు పెరగలేదు. ఫోన్ రేడియేషన్ మెదడుకు హాని కలిగిస్తుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు కనుగోలేదట.

ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్, ఎక్స్-రే లాగా శక్తివంతమైనది కాదు. ఇవి మెదడు కణాలను ప్రభావితం చేసేంత శక్తివంతమైనవి కావు. దిండు పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటే గట్టిగా నిద్ర పట్టకపోవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై వచ్చే నోటిఫికేషన్ సౌండ్, లైట్ శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల నిద్ర బాగా పట్టకపోవచ్చు.

55
ఎందుకు పెట్టకూడదు?

దిండు దగ్గర ఫోన్ పెట్టకూడదనేందుకు మరో కారణం ఉంది. అది ఫోన్ ఎక్కువగా వేడెక్కడం. ఎక్కువ సేపు వాడితే ఫోన్ తాకితే చేతికి వేడిగా ఉంటుంది. ఇలా వాడటం ప్రమాదకరం. దిండు దగ్గర, మంచం దగ్గర చార్జ్ చేస్తే, ఎక్కువ వేడి కారణంగా కొన్నిసార్లు మంటలు చెలరేగవచ్చు. నాసిరకం లేదా దెబ్బతిన్న ఛార్జర్, దెబ్బతిన్న బ్యాటరీలు ప్రమాదకరం. ఈ కారణాల వల్ల ఫోన్‌ను దగ్గర పెట్టుకోవద్దు. మంచి నిద్ర కోసం ఫోన్‌ను దిండు దగ్గర, దిండు కింద పెట్టకోకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories