కాఫీ కంటే టీనే చాలా మంది ఇష్టపడుతారు. రోజుకు ఐదారు సార్లు కూడా టీని తాగేవారున్నారు. టీని మోతాదులో తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఓవర్ గా మాత్రం తాగకూడదు. ఇకపోతే కొంతమంది మిగిలిపోయిన టీ ని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వేడి చేసుకుని తాగుతుంటారు. అసలు ఇది మంచిదా? కాదా? అని ఎవ్వరూ ఆలోచన చేయరు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. టీని వేడి చేసి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీని తాగితే శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కానీ ఒకసారి తయారుచేసిన టీని పదేపదే వేడి చేసి తాగడం మన శరీరానికి అంత మంచిది కాదు. ఎందుకంటే టీ తయారుచేసిన సమయం పెరిగే కొద్దీ ఇది మన శరీరంపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఎలాగంటే?
బాక్టీరియా
చాయ్ ని పదేపదే 41 నుంచి 140 డిగ్రీల ఫారెన్ హీట్ కు వేడి చేసి తాగినప్పుడు మనం అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా టీని వేడి చేసినప్పుడు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చాయ్ లో ఏర్పడతాయి.
డయేరియా
మీకు తెలుసా? టీ తాగడం వల్ల డయేరియా సమస్య కూడా వస్తుంది. ఇది ఒకసారి తయారుచేసిన టీని పొద్దంతా పదేపదే వేడి చేసి తాగడం వల్లే వస్తుంది. ఇలా వేడి చేసిన టీని తాగడం వల్ల వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మళ్లీ మళ్లీ టీని వేడి చేయడం వల్ల రుచిలో కూడా మార్పు వస్తుంది.
పోషకాలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లూ టీ వంటి హెర్బల్ టీలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన బరువును తగ్గించడం నుంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎంతో మేలు చేస్తాయి.అయితే ఇలాంటి టీలను రెండోసారి వేడి చేసి తాగొద్దు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు నశిస్తాయి. ఇలాంటి వాటిని తాగినా పెద్దగా లాభం ఉండదు.