ఏమీ తినకుండా ఉదయం వాకింగ్ కు వెళితే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 6, 2024, 9:57 AM IST

చాలా మంది వాకింగ్ కు వెళుతుంటారు. కొంతమంది ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తే.. మరికొంత మంది మాత్రం ఒక్క ఉదయం మాత్రమే వాకింగ్ కు వెళుతుంటారు. అయితే చాలా మంది ఉదయం పరిగడుపునే వాకింగ్ చేస్తుంటారు. ఇలా ఏమీ తినకుండా వాకింగ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?
 

మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మనం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం హెల్తీ ఫుడ్ ను తింటూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా ఎన్నో రోగాల ముప్పును కూడా తప్పిస్తుంది. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల లేదా రన్నింగ్ చేయడం వల్ల మీరు ఫిట్ గా, చురుగ్గా ఉంటారు. ఇది శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఉదయాన్నే పరిగడుపున వాకింగ్ చేయడం వల్ల  మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

ఖాళీ కడుపుతో రన్నింగ్ 

ఉదయం లేచిన వెంటనే అంటే 6, 7 గంటలకు చాలా మంది వాకింగ్ కు వెళ్లడం చూసే ఉంటారు. ఈ టైంలో ఎలాంటి ఫుడ్ తినరు. అందరూ పరిగడుపునే వాకింగ్ కు వెళతారు. ఇలా పరిగడుపున వాకింగ్ కు వెళ్లడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Latest Videos


గుండె ఆరోగ్యంగా

రోజు రోజుకు మారిపోతున్న మన ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో రకాల గుండె సంబంధిత వ్యాధులు రావడం మొదలయ్యాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే పరగడుపున రన్నింగ్ కు వెళ్లాలి. రన్నింగ్ వల్ల గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.
 

జీర్ణక్రియకు మంచిది 

ఉదయం పరిగడుపున వాకింగ్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. దీంతో ఎలాంటి వ్యాధులు రావు. 
 

బాగా నిద్రపడుతుంది

ఉదయాన్నే పరిగడుపున రన్నింగ్ చేయడం వల్ల రోజంతా మీరు ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే  రాత్రిపూట మీకు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్ర కూడా పడుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కంటినిండా నిద్రపోవడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. 
 

బరువు తగ్గుతారు

వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు కూడా తగ్గొచ్చు. వాకింగ్ మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా అదనపు బరువును కూడా  తగ్గిస్తుంది. వాకింగ్ తో మీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులు కరుగుతాయి. మీరు బరువు పెరుగుతున్నట్టైతే ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయండి. ఇది మీ శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా, యాక్టివ్ గా ఉంచుతుంది.
 

running exercise


మానసిక ఆరోగ్యం మెరుగు

ఉదయాన్నే రన్నింగ్ కు వెళ్లడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో మీకు రోజంతా చక్కగా గడిచిపోతుంది. అలాగే పరిగడుపున వాకింగ్ చేయడం వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది.

రన్నింగ్ తర్వాత ఏం చేయాలి? 

ప్రతిరోజూ ఉదయం పరిగడుపున రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత తేలికపాటి బ్రేక్ ఫాస్ట్ చేయండి. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తగినంత నీళ్లు లేదా ఎనర్జీ డ్రింక్స్ ను తాగండి. 

click me!