మోకాళ్ల మధ్య దిండుతో పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 16, 2024, 12:46 PM IST

కొంతమందికి మోకాళ్ల మధ్యన దిండును పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచి అలవాటు కాదని చాలా మంది అంటుంటారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు మోకాళ్ల మధ్య దిండును పెట్టుకుని పడుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

కండరాల తిమ్మిరి

చాలా మంది కండరాల తిమ్మిరి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల  రోజువారి పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే మీ కాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రపోవడం వల్ల కండరాల తిమ్మిరి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

రక్త ప్రసరణ

పడుకోవడం వల్ల మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా చేరదు. దీనివల్ల మన శరీరంలోని అవయవాలలో జలదరింపు, తిమ్మిరి, సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మీ మోకాళ్ల మధ్యన దిండుతో నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో ఎలాంటి సమస్యలు రావు.
 

Latest Videos


మంచి నిద్ర

హాయిగా నిద్రపట్టాలని రోజూ అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే మీరు కాళ్ల మధ్యన దిండు పెట్టుకుని పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

వెరికోస్ వెయిన్స్ 

ఎక్కువ సేపు పనిచేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పాదాలు వాపు లేదా సిరలు మెలితిరగడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీరు మీ మోకాళ్ల మధ్య దిండుతో నిద్రపోవడం వల్ల నరాల సమస్యలు రావు. 
 

గర్భిణీ స్త్రీలకు సహాయం

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లకు ఎన్నో సమస్యలు వస్తుంటారు. ముఖ్యంగా వెన్నునొప్పి, మోకాళ్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సమస్యలేమీ రాకూడదంటే గర్భిణీ స్త్రీలు మోకాళ్ల మధ్య దిండుతో పడుకోవాలి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. 

వెన్నెముక

వెన్నెముకకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండటానికి ఇది మీకు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. మోకాళ్ల మధ్య దిండుతో నిద్రపోవడం కూడా వెన్నెముకను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

స్లీప్ అప్నియా

చాలా మందికి స్లీప్ అప్నియా సమస్య ఉంటుంది. ఇలాంటి వారు మోకాళ్ల మధ్య దిండుతో పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శరీర భంగిమను నియంత్రిస్తుంది. అలాగే వాయుమార్గాలను తెరవడానికి సహాయపడుతుంది.

click me!