ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు కలపడం మంచిది కాదా?

Published : Jun 09, 2023, 11:21 AM IST

పండ్లపై ఉప్పును జల్లుకుని తినడం మానేయాలి. ఎందుకంటే ఉప్పు జల్లిన పండ్లను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.    

PREV
14
ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు కలపడం మంచిది కాదా?

పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. పండ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్ వంటి పోషకాలను అందిస్తాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తి, జీవక్రియలు బలంగా ఉంటే వ్యాధులను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉంటుంది. అయితే మీకు పండ్లపై ఉప్పును జల్లుకుని తినే అలవాటు ఉంటే వెంటనే ఇలా తినడం మానేయండి. పండ్లను ఉప్పు లేదా చాట్ మసాలాతో తినడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. కానీ ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు ఉప్పు కలిపిన పండ్లను తినడం వల్ల  ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. 

24

పండ్లపై ఉప్పు చల్లడం వల్ల కలిగే నష్టాలు

పండ్లపై ఉప్పును చల్లి తినడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి. పండ్లతో పాటు ఉప్పు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పండ్లపై ఉప్పును చల్లి తింటే అలెర్జీ కూడా వస్తుందది. ఇది శరీరంలో వాపునకు కూడా కారణమవుతుంది.

34

మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే.. ఉప్పు వేసిన పండ్లను తినడం మానేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

గుండె జబ్బులు ఉన్నవారు కూడా పండ్లపై ఉప్పును చల్లి తినకూడదు. పండ్లపై ఉప్పు వేయగానే వాటి నుంచి వాటర్  బయటకు వస్తుంది. ఇది పండ్ల పోషణను తగ్గిస్తుంది.
 

 

44

పండ్లను ఎలా తినాలి?

పండ్లు తినేటప్పుడు.. మీరు ఒకసారి ఒకే పండు మాత్రమే తినాలి. 

మీరు ఫ్రూట్ చాట్ తినాలనుకుంటే తీపి లేదా పుల్లని పండ్ల సలాడ్ ను మాత్రమే తయారు చేయండి.

పుల్లని, తీపి పండ్ల సలాడ్లను కలిపి తినకూడదు.

పండ్లు కోసిన గంటలోపే తినాలి.

ఎక్కువ రోజులు ఉంచిన పండ్లలో కూడా పోషకాలు తగ్గుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories