ఊపిరితిత్తుల క్యాన్సర్ ముఖ్యమైన లక్షణాలివి..

Published : Aug 08, 2023, 04:29 PM IST

ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ ఒక ప్రమాద కారకం. స్మోకింగ్ చేసే 10 మంది పురుషుల్లో  9 మంది, 10 మంది మహిళల్లో 8 మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోందని సర్వేలు వెళ్లడిస్తున్నాయి.   

PREV
16
ఊపిరితిత్తుల క్యాన్సర్ ముఖ్యమైన లక్షణాలివి..

ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. భారత్ లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యం, పొగాకుకు గురికావడం వంటి అనేక అంశాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల కణజాలాలలో ఏర్పడే క్యాన్సర్. సాధారణంగా గాలి ప్రవహించే కణాలలో.
 

26

పురుషులు, మహిళలు ఇద్దరిలో క్యాన్సర్ మరణానికి ఇది ప్రధాన కారణం. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం చేసే 10 పురుషులలో 9 మంది, 10 మహిళల్లో 8 మంది ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ధూమపానం చాలా ముఖ్యమైన కారణాలలో ఒకటి. మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

36
lung cancer

1. దీర్ఘకాలిక దగ్గు అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి లక్షణం. నాన్ స్టాప్ గా,  భయంకరమైన దగ్గు కొన్నిసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణం కావొచ్చు. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోకుండా హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

2. ఊపిరితిత్తుల క్యాన్సర్ మరో లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కొంచెం నడిచినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే తప్పక హాస్పటల్ కు వెళ్లండి. 

3. దగ్గుతున్నప్పుడు రక్తం పడటం.

4. దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా శ్వాస తీసుకునేటప్పుడు ఛాతిలో, వీపు లేదా భుజంలో నొప్పి కలగడం.
 

46

5. త్వరగా బరువు తగ్గడం.

6. అలసటగా లేదా బలహీనంగా అనిపించడం

7. ఆకలి లేకపోవడం

8. బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం. 

9. ముఖం లేదా మెడ వాపు
 

56
lung cancer

10. మింగడంలో ఇబ్బంది లేదా నొప్పి

11. కఫంలో రక్తం

12. తలనొప్పితో పాటుగా ఒళ్లు, కీళ్ల నొప్పులు,

13. గరగర అంటే స్వరంలో మార్పు
 

66
lung cancer

14. దీర్ఘాకాలంగా ఉన్న దగ్గు, ఛాతీలో నొప్పి

15. వచ్చిపోయే జ్వరం

16. మింగడంలో ఇబ్బంది

17. విపరీతమైన తలనొప్పి

Read more Photos on
click me!

Recommended Stories