ప్రతి ఇద్దరు మహిళలల్లో ఒకరికి ఇన్ఫెక్షన్.. తరచుగా వస్తే డేంజర్?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 22, 2021, 08:45 PM IST

మానవ జీవితంలో అనేక ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా మూత్ర కోశ మార్గాలలో (Urinary tract) వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయరాదు. 

PREV
19
ప్రతి ఇద్దరు మహిళలల్లో ఒకరికి ఇన్ఫెక్షన్.. తరచుగా వస్తే డేంజర్?

మానవ జీవితంలో అనేక ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా మూత్ర కోశ మార్గాలలో (Urinary tract) వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఈ సమస్య గురించి వైద్యులకు (Doctors) చెప్పుటకు ఇబ్బందిపడుతుంటారు.
 

29

ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే (Women) ఎక్కువగా ఉంటుంది. మూత్రాశయం దగ్గర బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రాశయ మార్గం నుండి మూత్రం (Urine) బయటకు వెళ్లే మార్గం చిన్నగా ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా సులువుగా వ్యాపిస్తుంది.
 

39

ఈ బ్యాక్టీరియాను యాంటీబయాటిక్స్ (Antibiotics) తో నివారించవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ (Infection) తాలూకా బ్యాక్టీరియా మూత్రపిండాలకు వ్యాపిస్తే నడుము నొప్పి, జ్వరం, వికారం, వాంతులు కావడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ ను సంప్రదించాలి.
 

49

దీనిని మందులతో (Medicines) నయం చేయవచ్చు. ఈ సమస్య మూత్రపిండాలకు హానికరం. అది క్రమంగా అధిక రక్తపోటుకు (High blood pressure)
 దారితీస్తుంది. చివరకు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. గర్భధారణ సమయంలో ఏర్పడితే తల్లికి, బిడ్డకు కూడా ప్రమాదం.

59

ఈ ఇన్ఫెక్షన్ ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశముంది. ఇన్ఫెక్షన్ లక్షణాలు మూత్ర విసర్జన సమయంలో మంట (Inflammation) ఏర్పడుతుంది. మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు తక్కువ మూత్రం వస్తుంటుంది. పొత్తికడుపు కింది భాగంలో నొప్పిగా (Pain) ఉంటుంది. కలయికలో నొప్పి ఉంటుంది.
 

69

మూత్రం విసర్జన సమయంలో వాసన (Smell) వస్తుంది. మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల లోపలి బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు. మహిళలు బాత్ రూమ్‌ కు వెళ్లిన సమయాలలో ముందు మరియు వెనుక భాగాలలో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి (Cleaned).
 

79

మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్రాన్ని పూర్తిగా విసర్జించే ప్రయత్నం చేయాలి. మహిళలకు శుభ్రతకు వినియోగించే స్ప్రేలు, సువాసన ఇచ్చే బాత్రూం ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. లైంగిక చర్యలో (Sexual activities) పాల్గొనే ముందు, పాల్గొన్న తర్వాత బాక్టీరియా (Bacteria) శరీరంలోనికి వెళ్లకుండా మూత్ర విసర్జన చేసి శుభ్రం చేసుకోవాలి.
 

89

లైంగిక అవయాలను (Sexual organs) పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అందుకు పూర్తిగా తడి లేని కాటన్ దుస్తులు (Cotton clothing) ధరించాలి. మూత్ర కోశ వ్యవస్థలో గల బ్యాక్టీరియాను యాంటీబయాటిక్స్ తో నివారించవచ్చు.
 

99

ఈ సమస్య రాకుండా ఉండాలంటే పీచుపదార్థం (Fiber) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను, కూరగాయలను, పండ్లను తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు క్రాన్ బెర్రీ పండ్ల (Cranberry fruit) రసాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

click me!

Recommended Stories