డెంగ్యూ జ్వరం అనేది దోమ కుట్టిన మూడు నుంచి 14 రోజుల వ్యవధిలో ఈ జ్వరం తాలూకా లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ జ్వరం యొక్క మొట్టమొదటి లక్షణం శరీరంలో ప్లేట్లెట్ల స్థాయి పడిపోవడం. అందువల్ల మీకు తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, అలసట, వికారం వంటివి సంభవిస్తాయి.
డెంగ్యూ కోసం టీకా మాత్రమే నివారణ చర్య కాదు. మీ ఇంట్లోనే అందుబాటులో ఉన్న వాటితో కూడా డెంగ్యూ నివారించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాగా నానబెట్టిన వేపాకుల రసాన్ని తాగడం వల్ల రక్త ఫలకికల స్థాయిని, తెల్ల రక్త కణాలు స్థాయిని ఒకేసారి పెంచుతుంది.
అంతేకాకుండా మీ శరీరానికి కావలసిన రోగ నిరోధక వ్యవస్థని అందిస్తుంది. అలాగే ఆరెంజ్ తీసుకోవటం వలన కూడా డెంగ్యూ జ్వరాన్ని అదుపులో ఉంచవచ్చు. రోగ నిరోధక వ్యవస్థలో ఉన్న ప్రతిరక్షకాలను ప్రోత్సహించడంలో ఆరెంజ్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది.
శరీరంలో మలినాలను మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపించడంతోపాటు చర్మ కణాల మరమ్మతు చర్యలను ప్రేరేపించి కొత్త చర్మ కణాల దృష్టికి సహాయపడుతుంది. అలాగే తులసి ఆకులను నమలడం వల్ల డెంగ్యూ సహజంగానే నివారించబడుతుంది.
ఈ మొక్కలో ఉన్న సారం DENV-1 అనే డెంగ్యూ వైరస్ ని నిరోధించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధనల ద్వారా కనుగొనబడింది. తులసి ఆకులని శుభ్రం చేసుకుని నేరుగా తినవచ్చు లేదా టీ చేసుకుని తాగినా కూడా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే బొప్పాయి ఆకులని వాడటం వల్ల కూడా శరీరంలో ప్లేట్ల స్థాయిని పెంచవచ్చు.
ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది. అలాగే రక్తంలో అధికంగా ఉండే మలినాలని కూడా తొలగిస్తుంది దీనికి మీరు చేయవలసిందల్లా బొప్పాయి ఆకులని ముద్దగా నూరి దాని నుంచి రసాన్ని వేరు చేసి ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున తాగుతూ ఉండాలి. ఇంటి చిట్కాలు పాటించినప్పటికీ ఎప్పటికప్పుడు వైద్యుడి పర్యవేక్షణలో ఉండటం చాలా అవసరం.