బరువు తగ్గడానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కష్టపడాలి.. ఎందుకో తెలుసా?

First Published | Aug 28, 2023, 11:39 AM IST

ఆడవారు బరువు తగ్గడానికి ఎక్కువ కష్టపడటమే కాకుండా.. కూడా మగవారి కంటే వేగంగా, ఎక్కువగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. 
 

పురుషుల కంటే మహిళలే బరువు తగ్గడం చాలా కష్టమని చాలా మంది నిపుణులు అంటుంటారు. కానీ అలా ఎందుకు? మహిళలు బరువు తగ్గడానికి ఎక్కువ కష్టపడటమే కాకుండా.. పురుషుల కంటే వేగంగా, ఎక్కువగా బరువు పెరుగుతారని తరచుగా వింటుంటాం. పురుషుల కంటే మహిళలు బరువు తగ్గడానికి ఎక్కువ ఇబ్బంది పడటానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మహిళలు త్వరగా బరువు పెరుగుతారు

మగవారి కంటే ఆడవారే ఫాస్ట్ గా, ఎక్కువగా బరువు పెరుగుతారు. ఇది యుక్తవయస్సు నుంచే ప్రారంభమవుతుంది. యుక్తవయస్సులో చాలా మంది అమ్మాయిలు బరువు పెరుగుతారు. కానీ అబ్బాయిలు మాత్రం బరువు తగ్గుతారు. అయితే యుక్తవయస్సు వచ్చేసరికి ఇద్దరి శరీరంలో 35 నుంచి 40% కొవ్వు ఉంటుంది. అలాగే మహిళలు మరింత సులభంగా బరువు పెరుగుతారు. దీని వల్ల వారు బరువు తగ్గేటప్పుడు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
 

Latest Videos


మహిళల జీవక్రియ పురుషుల కంటే నెమ్మదిగా ఉంటుంది

ఆడవారిలో జీవక్రియ మందగించడం వల్ల సాధారణ శారీరక శ్రమ చేసిన తర్వాత కూడా.. ఆడవారు మగవారి కంటే తక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. అందుకే బరువు తగ్గడం మగవారి కంటే ఆడవారికి మరింత సవాలుగా మారుతుంది.
 

కొవ్వు నిల్వ సామర్థ్యం భిన్నంగా ఉంటుంది

కొవ్వు పంపిణీ, నిల్వ సామర్థ్యం పురుషులు, మహిళలు ఇద్దరిలో భిన్నంగా ఉంటుంది. పురుషుల్లో వారి కడుపు చుట్టూ ఉన్న ప్రాంతాలలో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇక మహిళల్లో తుంటి,  తొడల ప్రాంతంలో కొవ్వు నిల్వ ఉంటుంది.  చేస్తారు. హార్మోన్ల మార్పులే ఇందుకు కారణమవుతాయి. తుంటి, తొడలో నిల్వ  ఉన్న కొవ్వు మరింత మొండిగా ఉంటుంది. దీని వల్ల ఆడవారు వాటిని కరిగించడం కష్టమవుతుంది. 
 

belly fat loss

పురుషులు కొవ్వును కరిగించడం సులభం

పురుషుల్లో కొవ్వు నిల్వ వారి కడుపు దిగువ భాగంలో ఉంటుంది. ఇది తొడలు, పిరుదుల కంటే చాలా సులభంగా కరుగుతుంది. దీనితో పాటుగా పురుషుల శరీరంలో మహిళల కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. దీనివల్ల పురుషులకు కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కొవ్వును కరిగించడంలో కండరాలు కీలక పాత్ర పోషిస్తాయి.

belly fat loss

పురుషుల శరీర కొవ్వు మరింత ప్రమాదకరం

సాధారణంగా పురుషులకు కడుపు చుట్టూ కొవ్వు ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని కొన్ని పురుషుల మాదిరిగానే మహిళలకు కూడా కొవ్వు పంపిణీ అవుతుంది. దీనివల్ల ఆడవారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఊబకాయం ఉన్న పురుషులు మహిళల కంటే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు.
 

click me!