చిగుళ్ల వాపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ట్రై చేయండి!

First Published Dec 5, 2021, 12:55 PM IST

మనం రోజూ బ్రష్ చేసే సమయంలో చిగుళ్లవాపు (Gingivitis), చిగుళ్ల నుండి రక్తం కారడం (Bleeding gums) చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమస్యలకు ముఖ్య కారణం నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, దంతాల మధ్య పేరుకుపోయిన పాచి అనీ వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల సమస్యలు ఉన్నప్పుడు నోటి దుర్వాస‌న‌, చిగుళ్ళు వ‌దుల‌యి ప‌ళ్ళ మ‌ధ్య సందులు రావ‌డం జరుగుతుంది. ఈ సమస్యలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చిగుళ్లవాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు నుంచి విముక్తి పొందడానికి తీసుకోవలసిన చిట్కాల గురించి తెలుసుకుందాం..  
 

చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తిన్నా ఆ ప‌దార్థాలు ప‌ళ్ళ సందుల్లో ఇరుక్కుపోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది. అయితే వీటి కోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే తగిన ఫలితం (Result) ఉంటుంది. సమస్య మరింత ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ ను సంప్రదించటం అవసరం. డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు కొన్ని ఇంటి చిట్కాలను (Home tips) పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

దాల్చిన చెక్క: చిగుళ్ల సమస్య నుంచి విముక్తి కలిగించడానికి దాల్చినచెక్క (Cinnamon) చక్కగా పనిచేస్తుంది. చిగుళ్ల సంరక్షణ కోసం దాల్చిన చెక్క పొడిని పేస్టులా తయారు చేసుకుని చిగుళ్ల మీద అప్లై చేసుకోవాలి. రెండు నిమిషాల వరకు ఎటువంటి ద్రవ పదార్థాలను, ఆహార పదార్థాలను తీసుకోరాదు. రెండు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో (Lukewarm water) నోటిని శుభ్రపరుచుకోవాలి.
 

మింట్ ఆయిల్ : కొన్ని చుక్కల మింట్ ఆయిల్ (Mint Oil) ను నేరుగా చిగుళ్ల మీద అప్లై చేసుకుంటే చిగుళ్ల వాపు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ల సమస్యను నివారించడానికి మింట్ ఆయిల్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. మింట్ ఆయిల్ నోట్లోని చెడు బ్యాక్టీరియాను (Bacteria) నాశనం చేసి చిగుళ్ల వాపు నుంచి విముక్తిని కలిగిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గించి తాజా శ్వాసను అందించటానికి సహాయపడుతుంది.
 

క్యారెట్, బీట్ రూట్ : నోటి దుర్వాసన, దంత సంరక్షణ, చిగుళ్ల నుండి రక్తం కారడం  వంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి పచ్చిగా, ఫ్రెష్ గా ఉన్న వెజిటేబుల్స్ ను తీసుకోవడం ఉత్తమం. క్యారెట్ (Carrot), బీట్ రూట్ (Beet root), టమోటో వంటి వెజిటేబుల్స్ ను భోజనానికి ముందు తీసుకుంటే చిగుళ్ల సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.   
 

ఉప్పు నీరు (Salt water): చిగుళ్ల సమస్యలు వేధిస్తున్నప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పును ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని ఆ నీటితో నోరు పుక్కిలించడం చేయాలి. ఇది ఒక మంచి నేచురల్ రెమెడీ (Natural Remedy). ఇది నోటిలోని ఇన్ఫెక్షన్ లను తగ్గించి చిగుళ్ల వాపు, రక్తస్రావం, నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

బేకింగ్ సోడా, పసుపు: ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో చిటికెడు పసుపు కలుపుకుని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చిగుళ్ల మీద అప్లై చేసుకోవాలి. రెండు నిమిషాల తరువాత నీటితో నోటిని పుక్కిలించాలి. పసుపు (Turmeric), బేకింగ్ సోడాలో (Baking soda) ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలను తగ్గిస్తాయి.

click me!