రాత్రిళ్లు అకస్మత్తుగా మెలుకువ వస్తోందా? కారణం ఇదే..!

Published : Jul 05, 2023, 07:15 AM IST

ప్రతిరోజూ రాత్రి మనం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొంతమందికి రాత్రిళ్లు ఉన్నట్టుండి మెలుకువ వస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే? 

PREV
14
 రాత్రిళ్లు అకస్మత్తుగా మెలుకువ వస్తోందా? కారణం ఇదే..!
Image: Getty

నిద్ర అవసరం కాదు.. అత్యవసరం. ఎందుకంటే ఇదే మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. తిరిగి మనల్ని మరుసటి రోజుకు ఎనర్జిటిక్ గా మారుస్తుంది. అలాగే రోగాలు తర్వగా నయం అయ్యేందుకు సహాయపడుతుంది. అందుకే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం చాలా మందికి నిద్ర కరువైంది. నిద్రలేమి సమస్యతో ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. కొంతమందికి రాత్రిళ్లు తరచుగా మెలుకువ వస్తుంటుంది. దీనివల్ల మళ్లీ నిద్రపట్టడానికి చాలా సమయం పడుతుంది. అసలు ఇలా ఎందుకు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

24

పిండి పదార్థాలు

రాత్రి పడుకునే ముందు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినకండి.  బియ్యం, చిప్స్, బంగాళాదుంపలు, అరటిపండ్లు, పాస్తా వంటి ఆహారాల్లో పిండి పాదార్థాలు ఎక్కువగా ఉంటాయి.  కానీ ఈ కార్బోహైడ్రేట్లు మనకు నిద్ర లేకుండా చేస్తాయి. వీటిని ఎక్కువగా తింటే రాత్రిళ్లు తరచుగా మెలుకువ వస్తుంది. 
 

34

టీ, కాఫీ

మనదేశంలో టీ, కాఫీ లు తాగేవారికి కొదవే లేదు. రోజుకు ఐదారు సార్లు కూడా వీటిని తాగే వారున్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ముఖ్యంగా వీటిని తాగితే నిద్రకు భంగం కలుగుతుంది. ఎందుకంటే వీటిలో  కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనం నిద్ర రాకుండా ఉండేందుకు, రిఫ్రెష్ గా ఉండటానికి టీ, కాఫీ లను ఎక్కువగా తాగుతుంటాం. కానీ నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత టీ, కాఫీలను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తాగితే రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టదు. 

44

టెన్షన్స్

గజిబిజీ లైఫ్ లో చాలా మంది ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉంటున్నారు. ఈ బిజీ లైఫ్ లో టెన్షన్స్ సర్వ సాధారణంగా మారిపోయాయి. కానీ  ఈ టెన్షన్స్ మిమ్మల్ని ఎన్నో మానసిక, శరీరక సమస్యల బారిన పడేస్తాయి. టెన్షన్స్ మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర రుగ్మతకు ఇదే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.

Read more Photos on
click me!

Recommended Stories