డయాబెటీస్ ఉన్నవారి కోసం అన్నం ఎలా వండాలి?

First Published | Jun 1, 2024, 2:32 PM IST

బియ్యం మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు కలిగించినా వీటిని షుగర్ పేషెంట్లు మాత్రం తినకూడదు. ఎందుకంటే అన్నం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అయితే అన్నాన్ని ఒక పద్దతిలో వండితే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచదు.

బియ్యంలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో ఉటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు అన్నాన్ని తినొద్దని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే అన్నాన్ని షుగర్ పేషెంట్లు కూడా తినొద్దు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బియ్యం తినొద్దని హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా  అన్నాన్ని తినొచ్చు. 
 

బాగా నానబెట్టాలి

షుగర్ పేషెంట్లు అన్నాన్ని తినాలంటే బియ్యాన్ని బాగా కడగాలి. దీన్ని 2 గంటలు నానబెట్టాలి. ఎక్కువ సమయం బియ్యాన్ని నానబెడితే బియ్యంలో  గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచే అవకాశం తగ్గిస్తుంది. 

Latest Videos


నురగను తొలగించండి

అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యం నుంచి నురగ వస్తుంటుంది. ఇది బియ్యంలోని అదనపు పిండి, ఫైటిక్ ఆమ్లం. అందుకే ఈ నురగను తీసేస్తుండాలి.  దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు అన్నం అనుకూలంగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ ను పెంచే అవకాశం ఉండదు.
 

కొబ్బరి నూనె కలపాలి

అన్నం వండేటప్పుడు ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను కలపండి. దీనివల్ల బియ్యంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ 50% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు.
 

బిర్యానీ ఆకులను జోడించండి

ఉడికించిన అన్నంలో బే ఆకులను చేర్చడం మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అన్నంలో పోషకాలు పెంచడమే కాకుండా అన్నం సులువుగా జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది.
 

rice

నిమ్మకాయ జోడించండి

అన్నంలో నిమ్మకాయను పిండడం వల్ల బియ్యంలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది. మీకు డయాబెటిస్ ఉంటే ఈ విధంగా అన్నాన్ని వండి తినొచ్చు. అయితే వంట చేయడానికి ముందు డాక్టర్ ను ఒక సారి సంప్రదించండి.

click me!