మెంతులను ఇలా తింటే మధుమేహం దూరం

First Published | Jun 4, 2023, 4:40 PM IST

మెంతుల్లో యాంటీ డయాబెటిస్ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా మెరుగుపరుస్తుంది. మెంతుల్లో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. 

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ ఒక సాధారణ జీవక్రియ వ్యాధి. కానీ ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోలేం. కేవలం నియంత్రించగలం అంతే. కాగా డయాబెటీస్ పేషెంట్లకు మెంతులు ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్లూకోమెన్ ఫైబర్ తో సహా మెంతుల్లో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల్లో గ్రహించిన చక్కెర శోషణను ఆలస్యం చేస్తాయని ఆయుర్వేదంలో ఒక పరిశోధనా జర్నల్ అభిప్రాయపడింది. అంతేకాదు ఫినుగ్రెసిన్, ట్రైగోనెల్లిన్ వంటి ఆల్కలాయిడ్లు డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది. 

మెంతుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా మెరుగుపరుస్తుంది. మెంతుల్లో కరిగే ఫైబర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.


అధిక బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నవారు, తక్కువ కేలరీల ఆహారాన్ని తినే వారి రక్తంలో చక్కెర స్థాయిలు లేదా ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి మెంతులను నీటిలో నానబెట్టి తినడం అలవాటు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 10 గ్రాముల మెంతులను తీసుకోవడం వల్ల హెచ్ బిఎ 1 సి తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

fenugreek-seeds

మెంతుల్లో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్స్ జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణ మందగించేలా చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతులను మీ డైట్ లో చేర్చుకోవడం కూడా మంచిది. ఇది ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు మెంతి మొక్క ఆకులను కూరగా చేసుకుని కూడా తినొచ్చు. ఈ ఆకులు కొద్దిగా చేదుగా ఉన్నా  ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

మెంతుల్లో కాల్షియంతో పాటుగా వివిధ రకాల విటమిన్లు వంటి మన శరీరానికి అవసరమైన భాగాలు ఉంటాయి.  మెంతులు డయాబెటీస్ ను నియంత్రించడమే కాదు కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా దూరం చేస్తాయి. 

Latest Videos

click me!