ఎందుకు ఎక్కువ తింటరో తెలుసా?

First Published | Apr 27, 2024, 9:55 AM IST

బాగా తింటూ, ఎలాంటి శారీరక శ్రమ చేయకుంటే ఈజీగా బరువు పెరిగిపోతారు. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు పెరగడానికి అసలు కారణం హెవీగా తినడమే. అయితే ఇలా హెవీగా ఎందుకు తింటారో తెలిస్తే షాక్ అవుతారు. 
 

మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని రకాల పోషకాలు అవసరమన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హెల్తీ ఫుడ్ ను తినాలని సూచిస్తుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. అయితే మన శరీరంలో  ఏ ఒక్క పోషకం లోపించినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు మన శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపిస్తే కూడా ఊబకాయం బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అతిగా తిన్నా, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఊబకాయం బారిన పడతారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇది నిజమే అయినా .. శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా ఊబకాయం బారిన పడుతుంటారు. ఏయే పోషకాల వల్ల ఊబకాయం బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos



విటమిన్ డి

మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలాచాలా అవసరం. కానీ మీ శరీరంలో ఈ పోషకం లోపిస్తే జీవక్రియ, ఇన్సులిన్ సున్నితత్వం దెబ్బతింటుంది. ఇది కొవ్వు కరగడాన్ని దెబ్బతీస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది.

obesity

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మన శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఈ కొవ్వు ఆమ్లాలు లోపిస్తే ఆకలి హార్మోన్లు దెబ్బతింటాయి. దీనివల్ల మీరు కేలరీలు ఎక్కువగా ఉండే  ఫుడ్ ను తింటారు. అలాగే ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. 

obesity

ప్రోటీన్

ప్రోటీన్ మన శరీరానికి ఎంతో అవసరం. ఇది మన ఎముకలు, కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి ఎంతో సహాయపడుతుంది. మన శరీరానికి ప్రోటీనే శక్తి వనరు. అయితే ప్రోటీన్ లోపిస్తే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. 

విటమిన్ బి

మన శరీరం మొత్తం అభివృద్ధికి బి12, బి6 వంటి విటమిన్ బి లు చాలా అవసరం. మీ శరీరంలో ఇది లోపిస్తే మీరు బాగా అలసటకు గురవుతారు. అలాగే చక్కెర కోరికలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. 

అయోడిన్

మన శరీరానికి అయోడిన్ చాలా చాలా అవసరమైన పోషకం. ఇది లోపిస్తే హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. దీనివల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఇనుము

సాధారణంగా ఇనుము లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుందని అనుకుంటారు. అయితే ఇనుము లోపం వల్ల ఒక్క రక్తహీనత సమస్య మాత్రమే కాదు ఇది అలసటకు కూడా దారితీస్తుంది. అలాగే జీవక్రియకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. 

click me!