Weight loss: ఈజీగా బరువు తగ్గాలంటే వాకింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే చాలు!

Published : Feb 10, 2025, 03:11 PM IST

హెల్తీ లైఫ్ స్టైల్ కోసం చాలామంది ప్రతిరోజూ వాకింగ్ చేస్తుంటారు. అయితే వాకింగ్ చేసేటప్పుడు ఒక సింపుల్ ట్రిక్ పాటిస్తే చాలట. ఆరోగ్యానికి ఆరోగ్యం. బరువు కూడా ఈజీగా తగ్గవచ్చట. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోండి మరి.

PREV
16
Weight loss: ఈజీగా బరువు తగ్గాలంటే వాకింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే చాలు!

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతమేలు జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే వాకింగ్ చేసేటప్పుడు ఒక సింపుల్ ట్రిక్ పాటించడం వల్ల వాకింగ్ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునేవారికి ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుందట.

 

26
బరువు తగ్గడం:

వాకింగ్ చేసేటప్పుడు మామూలుగా కాకుండా వీపుపై బరువు పెట్టుకొని నడవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శరీర బరువులో 5 నుంచి 7% వరకు తగ్గుతుంది. శరీర దృఢత్వం, కండరాలు మెరుగుపడటానికి ఈ వ్యాయామం సహాయపడుతుంది. సాధారణంగా సైనికులకు శిక్షణ ఇచ్చేటప్పుడు వీపుపై బరువు ఉంచి శిక్షణ ఇస్తారు. ఇది వారి శక్తిని, శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. ఈ పద్ధతిని మనం వాకింగ్ చేసేటప్పుడు పాటిస్తే బరువు త్వరగా తగ్గవచ్చట. కానీ ఎంత బరువు మోయాలనేది ముఖ్యం.

36
ఎంత బరువు?

తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు ఖర్చు చేయడానికి ఈ వ్యాయామం సహాయపడుతుంది. కానీ ఎక్కువ బరువు మోస్తూ నడవడం మంచిది కాదు. రెగ్యులర్ గా వాకింగ్ చేసేవారు మాత్రమే బ్యాక్ ప్యాక్ లో బరువుతో నడవాలి. వ్యాయామాలు అలవాటు లేని వ్యక్తులు ఇలా చేస్తే వీపు, మెడ భాగాల్లో నొప్పి రావచ్చు. శరీరంలో బలం లేనివారు, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ లేనివారు ఈ వ్యాయామం చేయకూడదు. శరీర బరువులో 10 శాతం లోపు బరువున వీపుపై మోస్తూ నడవాలి.

46
ఇవి గుర్తుంచుకోండి!

నడిచేటప్పుడు నేరుగా చూస్తూ నిటారుగా నడవాలి. వంగి కిందకి చూస్తూ నడవకూడదు. మీరు మోసే బరువు, దూరం రెండింటినీ క్రమంగా పెంచుకోవచ్చు. పోషకమైన ఆహారం, సరైన వ్యాయామ నియమాలు పాటిస్తే ఆరోగ్యకరమైన రీతిలో త్వరగా బరువు తగ్గవచ్చు. 

56
ఏ రకమైన బరువు?

రెండు వైపులా వేసుకొనే బ్యాగ్‌లో పుస్తకాలు, నీటి బాటిల్ వంటివి ఉంచి తేలికపాటి బరువుతో నడవవచ్చు. తక్కువ బరువులతో నడవడం ప్రారంభించి వ్యాయామం చేయవచ్చు. కానీ అది రెండు వైపులా సమానంగా ఉండేలా చూసుకోవాలి.

66
ప్రయోజనాలు:

బ్యాగ్‌లో బరువులు వేసుకుని నడవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మొత్తం శరీరానికి వ్యాయామం అవుతుంది.

గమనిక: 

ఈ వ్యాయామం చేయడం ప్రారంభించే ముందు మీరు మోయాల్సిన బరువు గురించి ఆరోగ్య నిపుణుడు లేదా డాక్టరును సంప్రదించడం మంచిది.

click me!

Recommended Stories