పెదవులు తెల్లగా ఉంటే మంచిది కాదా?

First Published Feb 23, 2024, 12:45 PM IST

పెదవుల రంగు కూడా మన ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అవును పెదవుల రంగు మారడం ఎన్నో వ్యాధులకు ప్రారంభ సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యకు దారితీస్తుంది. అందుకే మీ పెదవుల రంగు ఎలా ఉంటే కంగారు పడాలో తెలుసుకుందాం పదండి.. 
 


శరీరంలో ఏదైనా లోపం లేదా సమస్య ఉంటే.. మన శరీరం ఏదో ఒక రూపంలో దాని సంకేతాలను తెలియజేస్తుంది. అందుకే మన  శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. అయితే మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సీక్రేట్స్ ను మన పెదాలు కూడా చెప్తాయి. అవును పెదాల రంగు మారితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

వయసు పెరిగే కొద్దీ మన పెదవుల రంగు కూడా మారుతుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. అంటే ఎరుపు, తెలుపు, నలుపు, నీలం వంటి రంగులు. పెదాల రంగు మారితే ఎలాంటి సమస్య ఉన్నట్టో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

తెల్లని పెదవులు

పెదవుల రంగు తెల్లగా ఉంటే.. మీ శరీరంలో రక్తం తగ్గిందని అర్థం. తెల్లని పెదవులు రక్తహీనత సమస్యకు సంకేతం. అంతేకాకుండా రక్తంలో బిలుర్బిన్ పరిమాణం పెరగడం వల్ల కూడా పెదువులు తెల్లగా కనిపిస్తాయి. కొన్ని సార్లు ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవుతుంది. 

ఎరుపు పెదవులు

పెదవులు ఎర్రగా ఉండటాన్ని చాలా మంది ఇష్టపడతారు. అయితే ఎర్రని పెదవులు కూడా  మీకు ఎన్నో విషయాలను చెప్తాయి.  ఉన్నపాటుగా మీ పెదవులు ఎర్రగా కనిపిస్తే అది కాలేయ బలహీనతకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.
 

నీలిరంగు పెదవులు

మీ పెదవులు నీలం రంగులో కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రంగు పెదవులు మీ శరీరంలో ఆక్సిజన్ లేకపోవడాన్ని, అధిక కార్బన్ డయాక్సైడ్ కు సంకేతాన్ని చూపిస్తుంది. ఇవి అత్యవసర పరిస్థితికి సంకేతం కూడా కావొచ్చంటున్నారు నిపుణులు. అంతేకాకుండా నవజాత పిల్లల పెదవులు నీలం రంగులో కనిపిస్తే.. వారి ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతం కావొచ్చు.
 

నల్లని పెదవులు

సాధారణంగా బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెదాలు నల్లగా మారుతాయని చాలా మంది భావిస్తారు. కానీ నల్లని పెదాలు మీ జీర్ణవ్యవస్థ గురించి వెల్లడిస్తాయి. అందుకే సమస్య పెరగక ముందే వైద్యులను సంప్రదించడం మంచిది.

click me!