
ముద్దు ప్రేమకు సంకేతం. భార్యభర్తల మధ్య ఈ ముద్దు సెక్స్ వరకు తీసుకెళుతుంది. నిజానికి ఈ ముద్దు ఆనందాన్ని కలిగించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అసలు ముద్దు పెట్టుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
'హ్యాపీ హార్మోన్లను' పెంచుతుంది
ముద్దు మీ మెదడు రసాయనాలు విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ముద్దు ఆక్సిటోసిన్, డోపామైన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇవి మీకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అలాగే మీ బంధాన్ని బలపరుస్తుంది. ముద్దు ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది
ముద్దు కార్టిసాల్ స్థాయిలను, ఒత్తిడిని తగ్గిస్తుంది. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఐ లవ్ యు చెప్పుకోవడం వల్ల ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆందోళనను తగ్గిస్తుంది
ఒత్తిడి, యాంగ్జైటీ తో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే ముద్దు మిమ్మల్ని ఈ సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముద్దు ఆక్సిటోసిన్ ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే మీ శ్రేయస్సును పెంచుతుంది.
రక్త నాళాలను విస్తరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది
ముద్దు మీ రక్త నాళాలను విస్తరిస్తుంది. అలాగే మీ హృదయ స్పందన రేటును పెంచుతుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ముద్దు మన జీవితంలో మధురమైన ఆనందాలలో ఒకటి. అయితే రక్త నాళాలు విస్తరించినప్పుడు మీ రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఇది మీ రక్తపోటును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దు గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
తిమ్మిరి నుంచి ఉపశమనం
రక్తనాళాలు విస్తరించడం వల్ల రక్త ప్రవాహం పెరిగి తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఫీల్-గుడ్ రసాయనాలు పెరగడం, పీరియడ్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. పీరియడ్ సమయంలో ముద్దు పెట్టుకుంటే నొప్పి, తిమ్మిరి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
తలనొప్పి నుంచి ఉపశమనం
తలనొప్పి చిన్న సమస్యే అయినా.. ఇది చిరాకును కలిగిస్తుంది. ఏ పనీ చేయనీయదు. అయితే ఈ సమయంలో భాగస్వామిని ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దుతో రక్తనాళాలు విస్తరించి రక్తపోటు తగ్గి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ముద్దు ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని నివారించడానికి సహాయపడుతుంది.
మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ముద్దు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ముద్దుతో లాలాజలం మార్పిడి అవుతుంది. దీంతో కొత్త సూక్ష్మక్రిములు మీకు వ్యాపిస్తాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ముద్దు పెట్టుకునే జంటలు వారి లాలాజలంలో, వారి నాలుకలపై ఒకే మైక్రోబయోటాను పంచుకుంటారని 2014 ఒక అధ్యయనం కనుగొంది.
అలెర్జీని తగ్గించండి
ముద్దు పుప్పొడి, ఇంటి దుమ్ము పురుగులతో సంబంధం ఉన్న దద్దుర్లు, అలెర్జీ, ఇతర సంకేతాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తేలింది.
కొలెస్ట్రాల్ మెరుగుదల
రొమాంటిక్ ముద్దు ఫ్రీక్వెన్సీని పెంచిన జంటలు వారి మొత్తం సీరం కొలెస్ట్రాల్ లో మెరుగుదలను అనుభవించారని 2009 అధ్యయనం కనుగొంది. మీ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ తో సహా ఎన్నో వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
లాలాజల ఉత్పత్తి పెరుగుదల
ముద్దు మీ లాలాజల గ్రంథులను ప్రేరేపిస్తుంది. దీంతో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మీ నోటిని లూబ్రికేట్ చేస్తుంది. ఫుడ్ ను మింగడానికి సహాయపడుతుంది. ఆహారాలు మీ దంతాలకు అంటుకోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇది దంత క్షయం, కుహరాలను నివారించడానికి సహాయపడుతుంది.
సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది
రొమాంటిక్ ముద్దు మిమ్మల్ని సెక్స్ వరకు తీసుకెళుతుంది. అలాగే ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్ లో పాల్గొనాలనుకుంటే అతనికి తరచుగా ముద్దు పెడుతుందని అధ్యయనం తేల్చిందది. లాలాజలంలో టెస్టోస్టెరాన్ కూడా ఉంటుంది. ఇదొక సెక్స్ హార్మోన్. మీరు ఎక్కువసేపు, ఎక్కువ ఉద్వేగంతో ముద్దు పెట్టుకుంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా విడుదల అవుతుంది.
ఇది కేలరీలను బర్న్ చేస్తుంది
ముఖ కండరాలను ఉపయోగించడం వల్ల కేలరీలు కూడా ఖర్చవుతాయట. మీరు ఎంత ఉద్వేగంగా ముద్దు పెట్టుకున్నారో బట్టి మీరు నిమిషానికి 2 నుంచి 26 కేలరీల వరకు బర్న్ చేయొచ్చు.