మన శరీరానికి మూత్రపిండాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. మూత్రపిండాలు శరీరంలోని మురికిని బయటటకు పంపేందుకు, సిరలను శుభ్రపరిచేందుకు సహాయపడతాయి. అలాగే ఇవి శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని అన్ని భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ మూత్రపిండాలలో మన ఆహారం నుంచి కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్, యూరియా పేరుకుపోవడం వల్ల దాని వడపోత పని ప్రభావితం అవుతుంది. ఇది ఎన్నో మూత్రపిండాల సమస్యలకు, స్టోన్స్ కు కారణమవుతాయి. అందుకే కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొబ్బరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి, కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది.