Health Tips: పసిపిల్లలలో గ్యాస్ ప్రాబ్లమా.. అయితే ఈ చిట్కాలతో సమస్యని తరిమేయండి?

Published : Jul 27, 2023, 10:50 AM IST

Health Tips: చిన్నపిల్లలలో అప్పుడప్పుడు గ్యాస్ సమస్య రావడం పరిపాటి. అందుకని వెంటనే హాస్పిటల్కి పరిగెట్టకండి. వంటింటి చిట్కాలతో సమస్యను తరిమేయవచ్చంట  ఎలాగో చూద్దాం.  

PREV
16
Health Tips: పసిపిల్లలలో గ్యాస్ ప్రాబ్లమా.. అయితే ఈ చిట్కాలతో సమస్యని తరిమేయండి?

చిన్నారుల లో సైతం అప్పుడప్పుడు గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి అయితే  వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా చిన్న చిన్న ఇంటి చిట్కాలతో  గ్యాస్ సమస్యను తరిమేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు బాధ చెప్పుకోలేక గట్టిగా ఏడుస్తారు.
 

26

 ముందు ఎందుకు ఏడుస్తున్నారో గమనించండి. చిన్నపిల్లలు తమ బాధని చెప్పుకోలేక ప్రతి విషయాన్నికి ఏడుస్తారు కాబట్టి ఆకలికి ఏడుస్తున్నారా.. కడుపునొప్పికి ఏడుస్తున్నారో గమనించండి.
 

36

ఏడుస్తున్నప్పుడు వారి పొట్ట ఉబ్బుగా గట్టిగా ఉన్నట్లయితే వారు గ్యాస్ సమస్య బాధతో ఏడుస్తున్నట్లుగా గుర్తించండి. ముందుగా పసిబిడ్డని బోర్లా పడుకోబెట్టి వీపుపై మెత్తగా మసాజ్ చేయండి. దానివల్ల గ్యాస్ తేనుపు ద్వారా గాని, క్రింది నుంచి గాని పోయే అవకాశం ఉంటుంది.
 

46

 కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు బాబుని అడ్డగా పడుకోబెట్టకుండా  నిలువుగా ఉంచేందుకు ప్రయత్నించండి. వుడ్ వర్డ్స్ గ్రైప్  వాటర్ కూడా చిన్న పిల్లలకి కడుపు నొప్పికి కడుపు ఉబ్బరానికి  మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు పిల్లలని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని కాళ్లు చేతులని బాగా అటు ఇటు కదుపుతూ ఉండండి.
 

56

 ఆ ఒత్తిడికి గ్యాస్ బయటికి వచ్చేస్తుంది. వాము అనేది చిన్నారుల్లో గ్యాస్ సమస్యని దూరం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా వాము వేసే ఉడికించాలి నీళ్లు సగానికి మరిగిన తర్వాత వడకాచి పక్కన పెట్టుకోండి. కాస్త చల్లారిన తరువాత అందులో కాస్త పట్టిక బెల్లం కానీ కాస్త తేనె కానీ కలిపి పిల్లలకి కొద్ది కొద్దిగా నోటికి అందించండి.
 

66

వారు తాగగలిగితే కొంచెం హెర్బల్ టీ ని తాగించండి. ఇది పసిపిల్లలకి ఆమోదయోగిమే అని ఆయుర్వేదం కూడా చెప్పింది కాబట్టి అనుమానపడకుండా వారు తాగగలిగితే మాత్రం తప్పకుండా హెర్బల్ టీ తాగించవచ్చు.

click me!

Recommended Stories