ఈ అలవాట్లు ఎన్నో రోగాలు వచ్చేలా చేస్తయ్ జర జాగ్రత్త..

First Published Apr 26, 2023, 3:17 PM IST

హార్మోన్ల మార్పులు ఎన్నో రోగాలకు దారితీస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, సంతానోత్పత్తి సమస్యలు, జీవక్రియ దగ్గడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. 
 

హార్మోన్లు సమతుల్యంగా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. హార్మోన్లలో ఏ మాత్రం మార్పులు వచ్చినా లేనిపోని రోగాలు వస్తాయి తెలుసా? హార్మోన్ల అసమతుల్యత మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆకలి, బరువు, జీవక్రియ వంటి ఎన్నో విధులను హార్మోన్లు నియంత్రిస్తాయి. ఏదేమైనా కొన్ని అలవాట్లు హార్మోన్లు పెరగడానికి లేదా తగ్గడానికి కారణమవుతాయి. ఇది మీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కెఫిన్

కెఫిన్ ను ఎక్కువగా తీసుకున్నా హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కెఫిన్ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కార్డిసాల్ స్థాయిలు పెరిగినప్పుడు  ఒత్తిడి బాగా పెరుగుతుంది. అంతేకాదు మంటను కంట్రోల్ చేసే మీ శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.
 

Latest Videos


తగినంత నిద్ర లేకపోవడం

నిద్ర మన శరీరానికి అవసరం కాదు. అత్యవసరం. ఎందుకంటే నిద్రతోనే మన శరీరం తిరిగి ఎనర్జిటిగ్ గా మారుతుంది. ఇది శరీరాన్ని పునరుత్తేజపరచడానికి శక్తివంతమైన విధానం. మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత విశ్రాంతి అవసరం. అయితే కంటినిండా నిద్రపోనప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. అలసటతో పాటుగా నిద్ర లేకపోవడం కూడా  ఒత్తిడి లక్షణాలే. 
 

భోజనాన్ని స్కిప్ చేయడం

ప్రస్తుతం చాలా మంది తీరికలేకుండా పనుల్లో మునిగిపోతున్నారు. పనులు ముఖ్యమే.. ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. కానీ చాలా మంది ఆఫీసులకు లేట్ అవుతుందని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను, మధ్యాహ్నం భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ మనం ఉదయం తినే ఆహారమే మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అదికూడా పోషకాహారాన్ని తిన్నప్పుడే. అయితే చిన్న టోస్ట్ లేదా కాఫీ వంటి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే దీర్ఘకాలికంగా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.
 

జిమ్ లో చాలా కష్టపడటం

కేలరీలను బర్న్ చేయడానికి శారీరక శ్రమలో పాల్గొనడం తప్పేం లేదు. కానీ ఇంకా కేలరీలను ఎక్కువగా కరిగించాలని.. మీ శక్తిస్థాయికి మించి జిమ్ లో చెమటలు చిందిస్తే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కూడా దారితీస్తుంది తెలుసా? 
 

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, అల్యూమినియం డబ్బాలు, సౌందర్య సాధనాల్లో ఎండోక్రైన్ కు అంతరాయం కలిగించే పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు హార్మోన్ల స్రావానికి బాధ్యత వహించే మీ శరీరం ఎండోక్రైన్ వ్యవస్థ సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి.
 

click me!