హ్యాంగోవర్ ను తగ్గించే చిట్కాలు

Published : Jul 17, 2023, 07:15 AM IST

వీకెండ్స్ లో తీసుకునే ఆల్కహాల్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దాని వల్ల కలిగే హ్యాంగోవర్ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు మీకోసం..   

PREV
18
 హ్యాంగోవర్ ను తగ్గించే చిట్కాలు

వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా టైం స్పెంట్ చేస్తాయి. అలాగే మందును తాగుతుంటారు. మానసిక స్థితిని మెరుగుపరచడానికి తీసుకున్న ఆల్కహాల్ మరుసటి రోజు అలసట, వాంతులు, తలనొప్పి సమస్యలను కలిగిస్తుంది. అలాగే మీ మానసిక స్థితిని కూడా పాడుచేస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలకు హ్యాంగోవర్స్ అని పేరు పెట్టారు. హ్యాంగోవర్లు కండరాల నొప్పిని కూడా కలిగిస్తాయి. హ్యాంగోవర్ల నుంచి ఉపశమనం పొందడానికి హ్యాంగోవర్లకు మందులు కూడా తీసుకుంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా హ్యాంగోవర్ ను తగ్గిస్తాయి. 

28

సమస్యకు కారణమేంటి

హ్యాంగోవర్లు నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు, కడుపు, ప్రేగులలో పేగు వాపు, నిద్ర రుగ్మతలకు కారణమవుతాయి. హ్యాంగోవర్ ను నయం చేయడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

38

హైడ్రేషన్

హ్యాంగోవర్ ను వదిలించుకోవాలంటే మీరు నీటిని పుష్కలంగా తాగాలి. దీంతో మీ శరీరం హైడ్రేట్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇది నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.  అందుకే మందు తాగే ముందు హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల  హ్యాంగోవర్లను నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది. మందు తాగడానికి ముందు ఒక గ్లాసు నీటిని తాగితే హ్యాంగోవర్ ఉండదు. హ్యాంగోవర్లను నయం చేయడానికి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించడానికి స్పోర్ట్స్ డ్రింక్స్ ను తాగండి. 

48

అల్పాహారం

హ్యాంగోవర్ల వల్ల వచ్చే తలనొప్పి కారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినాలనిపించదు. హ్యాంగోవర్ రక్తంలో తక్కువ చక్కెరకు కారణమవుతుంది. ఉదయాన్నే తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. శరీరం ఆల్కహాల్ ను విచ్ఛిన్నం చేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి కారణమవుతుంది. ఇది హ్యాంగోవర్ కు దారితీస్తుంది. శరీరానికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లతో సహా మరమ్మత్తు, పునరుద్ధరణకు పోషకమైన ఆహారాలు అవసరం.

58

యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారాలు

ఆల్కహాల్ ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది శరీరం ఫ్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు దీనిని తొలగించడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే హ్యాంగోవర్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బెర్రీలు, చెర్రీలు, ద్రాక్ష, దానిమ్మ, క్యారెట్లు, బచ్చలికూర, అల్లం, డార్క్ చాక్లెట్, విత్తనాలను తినండి. అలాగే బ్లాక్ టీ ని తాగండి. 

68

కార్బోహైడ్రేట్లు తీసుకోండి 

మందు ఎక్కువగా తాగడ వల్ల గ్లూకోజ్ జీవక్రియ ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పునకు దారితీస్తుంది. ఇది అలసట, చిరాకు, బలహీనతకు కారణమవుతుంది. పిండి పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తింటే తక్షణ శక్తి అందుతుంది. జీవక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ ఫ్రైడ్ ఫుడ్  ను తినకూడదు. ఎందుకంటే కొవ్వు ఆల్కహాల్ ను గ్రహించలేకపోతుంది.

78

చామంతి టీ

కొంతమందిని హ్యాంగోవర్ మానసికంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, యాంగ్జైటీ పెరుగుతాయి. అయితే చామంతి టీని తాగడం వల్ల భావోద్వేగాలు నియంత్రణలోకి వస్తాయని హార్వర్డ్ హెల్త్ అధ్యయనం సూచిస్తుంది. ఆల్కహాల్ నిర్జలీకరణం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

88

తగినంత నిద్ర 

ఆల్కహాల్ మీ నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కువ నిద్రపోవడం వల్ల హ్యాంగోవర్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories