హోలీ ఆడుతున్నారా... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

First Published Mar 9, 2020, 3:14 PM IST

రంగుల్లో ఉండే కెమికల్స్ కారణంగా.. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాదు.. ప్రతి సంవత్సరం.. ఈ హోలీ కారణంగా మృత్యవాత పడుతున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది కళ్లు కూడా పోగొట్టుకుంటున్నారు.

రంగు రంగుల హోలీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ హోలీ పండగను ఆనందంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ... ఆనందాలు పంచుకుంటారు.
undefined
ఇంత ఆనందంగా జరుపుకునే హోలీతో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రంగుల్లో ఉండే కెమికల్స్ కారణంగా.. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.  అంతేకాదు.. ప్రతి సంవత్సరం.. ఈ హోలీ కారణంగా మృత్యవాత పడుతున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది కళ్లు కూడా పోగొట్టుకుంటున్నారు.అలా అని హోలీ జరుపుకోకుండా ఉండలేము. మరి ఏం చేయాలి..? కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే చాలు.. ఎలాంటి హానీ లేకుండా రంగుల పండగను ఎంజాయ్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం...
undefined
ముందుగా.. ఈ హోలీ పండగను సహజ రంగులతో ఆడటానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. కెమికల్స్ కలిపిన రంగులను కాకుండా సహజ రంగులతో హోలీ ఆడితే ఎలాంటి నష్టం కలగదు.
undefined
హోలీ అనగానే.. చాలా మంది పొట్టిపొట్టి బట్టలు, స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకుంటారు. అలాకాకుండా.. పూర్తిగా శరీరం అంతా కప్పి ఉంచేలాంటి డ్రస్సులు ఎంచుకోండి. అందులోనూ పాత బట్టలు అయితే  నయం. పాడైనా బాధపడాల్సిన అవసరం ఉండదు.
undefined
రంగులు పూసుకోవడానికి ముందు అమ్మాయిలు తలకి కొబ్బరి నూనె రాసుకొని.. జడ అల్లుకోవాలి..ఇక చర్మానికి బేబీ ఆయిల్ రాసుకోవాలి
undefined
రంగులు కళ్లలోకి పడకుండా.. సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. పెదాలు పాడవ్వకుండా ముందుగానే.. లిప్ స్టిక్, లిప్ బామ్ లాంటివి రాసుకోవాలి.
undefined
రుంగులు చేతికి అంటినప్పుడు.. గోళ్లు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. నెయిల్ పాలిష్ వేసుకోవాలి.డ్రై కలర్స్ తో హోలీ ఆడటం బెటర్.
undefined
హోలీ తర్వాత ఆ రంగులను ఎలా తొలగించుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం...
undefined
ముందుగా తలకి, బాడీకి ఆయిల్ రాసుకొని ఉన్నారు కాబట్టి.. రంగులు పోయేదాక షవర్ కింద నిల్చోవాలి.వేడి నీటితో స్నానం చేయకూడదు. చల్లని లేదా.. గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి.
undefined
వాటర్ తో కడిగిన తర్వాత కూడా రంగు పోకపోతే.. సబ్బు వాడకండి. ఆయిల్ తో.. రంగులు అంటిన చోట రుద్దండి. తర్వాత వాష్ చేయాలి.
undefined
శెనగపిండి, పెరుగు రెండూ కలిపి పేస్టులాగా చేసుకొని ముఖానికి, శరీరానికి రుద్దాలి.
undefined
అలా కాదు అంటే.. నిమ్మ చెక్కతో రుద్ది ఒక పది నిమిషాల తర్వాత నీటితో కడిగినా రంగులు సులభంగా వదులుతాయి.
undefined
click me!