Stress Relief: ఒత్తిడిని కంట్రోల్ చేసే అద్భుతమైన మూలికలు ఇవే!

Published : Mar 18, 2026, 03:05 PM IST

Stress Relief:అతిగా పని చేయడం, రోజువారీ హడావిడి వల్ల ఒత్తిడి, చికాకు ఎక్కువవుతున్నాయా? అయితే కొన్ని ఔషధ మొక్కలతో ఈ సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

PREV
14
తులసి

తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కార్టిసాల్ స్థాయిలను నియంత్రించి, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సాయపడుతుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు ఏమైనా ఉంటే ఇట్టే వదలగొడుతుంది. ఇది ఇంట్లోనే పెంచుకోవడం వల్ల మంచి ఆక్సిజన్ అందుతుంది. దీంతో టీ కూడా చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‍ను బర్న్ చేస్తుంది. 

24
అశ్వగంధ

ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. ఇది స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్‌ను తగ్గించి, నాడీ వ్యవస్థకు సహాయం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి అశ్వగంధ మంచి సహజ పరిష్కారం. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. బలహీనత, అలసట తగ్గించి రోజంతా యాక్టివ్‍గా ఉండేలా చేస్తుంది. మెదడు పనితీరును పెంచి, జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి సహాయపడుతుంది. మహిళలు, పురుషులలో హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్యల్లో పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కావాలంటే డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు.

34
శతావరి

శతావరి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో ఇది సాయపడుతుంది. పీరియడ్ సమస్యలు, హార్మోనల్ ఇష్యూస్ తొలగిస్తుంది. బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది. వారిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. శరీరాన్ని కూల్‍గా ఉంచి స్ట్రెస్ తగ్గిస్తుంది.

44
గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మంచి నిద్ర, సరైన ఆహారం, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వంటివి కూడా అధిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. నిద్ర పోవడం అంటే రాత్రి ఒంటిగంటకు పడుకుని తెల్లారి పదికో, పన్నెండుకో లేవడం కాదు…9, 10 కల్లా పడుకుని ఉదయం 5, 6 కు లేవాలి, అది సరైన నిద్ర. అప్పుడే శరీరం ఎనర్జీ, ఉత్సాహంతో ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories