Health Tips: మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి?

Published : Aug 11, 2023, 01:25 PM IST

Health Tips: వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత కారణంగా మోకాలు చూపులు ప్రారంభమవుతాయి. మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోకపోతే శస్త్ర  చికిత్స వరకు వెళ్ళవలసి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.  

PREV
16
Health Tips: మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి?

శరీరంలో మనం ప్రతిరోజు ఎక్కువగా వాడే ముఖ్యమైన ఊయవాలలో మోకాలు ఒకటి. నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మన మోకాలు చాలా ఒత్తిడిని భరిస్తుంది. ఎముకల్లో గట్టిదనం లేకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.

26

భారత్ లో ప్రతి ఏడది 1. 20 లక్షల మంది మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నట్లు అధ్యయనంలో నిరూపితమైంది. గతంలో 60, 70 ఏళ్ళు వచ్చాయంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో 30 ఏళ్ల నుంచే మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతున్నాయి.

36

చాలామందిలో ఈ నొప్పి ఆపరేషన్ కు కూడా దారితీస్తుంది. అయితే అంతవరకు వెళ్ళనివ్వకుండా చిన్న చిన్న వ్యాయామాలతో మోకాళ్ళ నొప్పులని తగ్గించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మోకాలిని చాచి వ్యాయామం చేయడం ద్వారా మోకాలు చుట్టూ కండరాలు బలపడతాయి.

46

అయితే మోకాలిని సరిగ్గా చాచకుంటే నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యాయామాన్ని ఎలాంటి సాధనం లేకుండా కేవలం కుర్చీని ఉపయోగించి చేయవచ్చు. ఈ వ్యాయామం వారానికి రెండుసార్లు చేయటం వల్ల మోకాలికి బలం పెరిగి నొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

56

మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవారు మెట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం వంటి పనులు చేయకూడదు. ఏరోబిక్, జుంబా వ్యాయామల్లో భాగంగా స్టెప్పర్ ను వాడటం వల్ల పేర్ల మీద ఒత్తిడి పెరిగినప్పుడు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ ఎక్సర్సైజ్లు చేయకండి. అలాగే మోకాలు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు కూడా వేయకండి.

66

అలాగే బాసింపట్టు కూడా వేయకూడదు. మోకాలి నొప్పుల కోసం శశాంకసనం సరియైన పద్ధతి. దీనివలన వెన్నుముక సాగి మెదడు విశ్రాంతి పొందుతుంది. మోకాళ్లు బలపడతాయి. పొత్తికడుపులోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. అయితే ప్రమాద తీవ్రతను బట్టి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

click me!

Recommended Stories