మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. ఎందుకంటే నిద్రలోనే మన శరీరం తనను తాను ఎన్నో సమస్యలను నయం చేసుకుంటుంది. దీని వల్ల మనం మరుసటి రోజు పూర్తి శక్తి వంతంగా, ఆనందంగా మేల్కొంటాం. అయితే చాలా మంది నిద్రలోకి జారుకున్నంక నోరు తెరుస్తారు. నోరు తెరిచి నిద్రపోయే అలవాటు చాలా చిన్నగా అనిపించినా ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును నోరు తెరిచి నిద్రపోయే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ అలవాటు మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేలా చేస్తుంది. అసలు నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఎందుకు మంచిది కాదో తెలుసుకుందాం పదండి..
దంత ఆరోగ్య ప్రమాదాలు
నోరు తెరిచి నిద్రపోవడం వల్ల మీ దంతాల ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఎలా అంటే నోరు తెరిచి నిద్రపోవడం వల్ల నోట్లోకి గాలి వెళ్లి.. నోట్లోని లాలాజలం ఆరిపోయేలా చేస్తుంది. ఇది లాలాజలం, ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే ఇది నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియాను పెంచుతుంది. దీనివల్ల దంతాలు దెబ్బతింటాయి. లాలాజలం లేకపోవడం వల్ల పంటి ఇన్ఫెక్షన్లు, చెడు వాసన, కావిటీస్ వంటి సమస్యలు వస్తాయి.
గుండెకు హానికరం
గుండెపోటు వచ్చే ప్రమాదం గురించి మాట్లాడుకున్నట్టైతే .. ఇతరులకన్నా నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తులకే ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. మీరు ముక్కుకు బదులుగా మీ నోటి నుంచి శ్వాసను తింటుకుంటే మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. ఇది ధమనులలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.
sleeping
ఉబ్బసం
నోరు తెరిచి పడుకునే అలవాటు కూడా మిమ్మల్ని ఆస్తమా పేషెంట్ ను చేస్తుంది. ఎందుకంటే నోరు తెరిచి పడుకోవడం వల్ల ఊపిరితిత్తులు మరింత శక్తితో పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల ఉబ్బసం వచ్చే ప్రమాదం ఉంది.
sleep
పొడి, పగిలిన పెదవులు
నోరు తెరిచి నిద్రపోవడం వల్ల కూడా పెదవులు పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. అంతేకాదు నోటి ద్రవాలు ఎండిపోవడం వల్ల ఆహారం మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
నోటి దుర్వాసన
నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా ఈ అలవాటు వల్ల వచ్చే చెడు ప్రభావాలలో ఒకటి. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియా మీ దంతాలు, నోటిలోకి ఎక్కువగా వెళ్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బ్యాక్టీరియా,ధూళి తర్వాత దుర్వాసనగా మారి ప్రజల మీ నోట్లో నుంచి చెడు వాసన వచ్చేలా చేస్తాయి.