తిన్నది అరగాలంటే ఏం చేయాలి?

First Published | Jan 18, 2024, 10:59 AM IST

చలికాలంలో చాలా మంది ఎక్కువగా అజీర్తితో బాధపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో ఆహారాన్ని ఎక్కువగా తింటుంటారు. అలాగే శారీరక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. చాలా మందికి వేయించిన, స్పైసీ ఫుడ్ ను తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Indigestion

అజీర్థి సమస్య చాలా మందిది ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఈ సమస్య పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా.. కొన్ని సార్లు మాత్రం దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో ఎప్పుడూ బాధపడుతున్నట్టైతే దానిని లైట్ తీసుకోవడం మంచిది కాదు. అయితే ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలోనే అజీర్థి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతర సీజన్ల కంటే  ఈ సీజన్ లోనే ఎక్కువగా తింటారు. ఫ్రైడ్ , స్పైసీ ఫుడ్ లను ఎక్కువగా తినడం, తిన్న వెంటనే నిద్రపోవడం వంటివి అజీర్థికి దారితీస్తాయి. 
 

అజీర్ణం లక్షణాలు

అజీర్ణం సమస్య ఉన్నప్పుడు పొత్తికడుపు పై భాగంలో నొప్పి కలుగుతుంది
కడుపు ఉబ్బినట్టుగా అనిపించడం
పుల్లని త్రేన్పులు
గుండెల్లో మంట
వాంతులు అయినట్టుగా అనిపించడం
 

Latest Videos


Indigestion

అజీర్ణాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు

ఒకవేళ మీకు పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే ఎక్కువగా తినడం మానుకోండి. ఆకలిగా ఉంటేనే తినండి. అది కూడా తేలికపాటి ఫుడ్ నే తినండి. ఇలాంటి సమయంలో కిచిడీని తినడం మంచిది, 

తిన్న తర్వాత చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలండి. అల్లం జీర్ణ రసాలు, ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. దీంతో మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. 

indigestion

తిన్న తర్వాత సోంపు తినడం వల్ల కూడా సమస్య ఉండదు. అవును సోంపు తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందుకోసం సోంపును వేయించి తిన్న తర్వాత బ్లాక్ సాల్ట్ తో తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

తులసి ఆకులు, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం కలిపిన కషాయాన్ని తయారుచేసి రోజుకు ఒకసారి తాగండి. ఇది జీర్ణక్రియకు సంబంధించిన ఎన్నో ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 
 

మీరు అజీర్థి సమస్యతో బాధపడుతున్నట్టైతే మీరు కెఫిన్, ఆమ్లం కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

అజీర్ణం వల్ల విరేచనాలు అయితే మీ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీనివల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి సమయంలో మీరు పానీయాలను ఎక్కువగా తాగాలి. లిక్విడ్ డైట్ ను ఫాలో అవ్వాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.

అజీర్థి సమస్యను తగ్గించుకోవడానికి జాజికాయ వినియోగం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జాజికాయ పొడిని నిమ్మరసంలో కలిపి నాకండి. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది.

click me!