పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది ఆడవారు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. ఇలాంటి వాటిలో మెఫ్తాల్ ఒకటి. చాలా మంది పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు వీటినే వాడుతుంటారు. అదికూడా డాక్టర్ ను సంప్రదించకుండా. కానీ వీటి వాడకంపై ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) డాక్టర్లు, రోగులకు డ్రగ్ సేఫ్టీ అలర్ట్ ను జారీ చేసింది. విషయం ఏంటంటే.. ఈ ట్యాబ్లెట్ లో మెఫానమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మీకు డ్రస్ సిండ్రోమ్ అనే సమస్యను కలిగిస్తుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ను ..పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి, ఆర్థరైటిస్ నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి బాగా వాడుతారు.