ఈ పండ్లను ఆయుర్వేదంలో ఔషదంగా పరిగణిస్తారు తెలుసా?

Published : May 01, 2023, 10:35 AM IST

నోటికి రుచిగా ఉన్నాయని మనం తినే ఎన్నో పండ్లు మనకు ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తాయి. అందుకే ఇలాంటి పండ్లను ఆయుర్వేదంలో ఔషదం లెక్క పరిగణిస్తారు. ఇంతకీ అవేంపండ్లంటే..?   

PREV
18
 ఈ పండ్లను ఆయుర్వేదంలో ఔషదంగా పరిగణిస్తారు తెలుసా?

మామిడి

మామిడిని ఆయుర్వేద పండ్లలో "రాజు"గా పరిగణిస్తారు. అయితే పండని మామిడి పండ్లను తింటే పిత్త, వాత సమస్యలు పెరుగుతాయి. కానీ ఇవి బాగా పండితే రుచికరంగా ఉండటమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ పోషక పండును తింటే పిత్త, వాత సమస్యలు తగ్గిపోతాయి. 
 

28

పుచ్చకాయ

పుచ్చకాయలు సమ్మర్ లో పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయను ముక్కలు చేసి తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా పిత్తం సమతుల్యం అవుతుంది. ఎండాకాలంలో పుచ్చకాయ  మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. 

38
Image: Getty Images

దానిమ్మ

దానిమ్మలు ఆస్ట్రింజెంట్,పుల్లని రుచిని కలిగుంటాయి. అయినప్పటికీ ఈ పండ్లలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఈ పండ్లు ముఖ్యంగా పిత్తం సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. దానిమ్మ జ్యూస్ ను తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది. అలాగే టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది.
 

48

పియర్

పియర్స్ హార్మోన్లను నియంత్రించడానికి బాగా సహాయపడతాయని ఖ్యాతి చెందాయి. జ్యుసీగా, తీయగా, తాజా పియర్ ను తినండి. ఈ పండు మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ పండు రీఫ్రెషింగ్ అనుభూతిని కలిగిస్తుంది. 

58
grapes

ద్రాక్ష

ఎండుద్రాక్షలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తప్పుతుంది. ఆయుర్వేదంలో వీటిని ఉత్తమ ఫలాలుగా పరిగణిస్తారు. నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్షలు బలే టేస్టీగా ఉంటాయి. 
 

68

అరటిపండు

అరటిపండులో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. అరటి ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడానికి మందపాటి రక్షిత శ్లేష్మ పొరను ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది. అరటిపండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్న మహిళలు వీటిని తినొచ్చు.

78
Jackfruit

జాక్‌ఫ్రూట్

జాక్‌ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, ఇతర ఫైటోన్యూట్రియెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ  పండు, దాని విత్తనాల చికిత్సా విలువను పెంచడానికి సహాయపడతాయి.
 

88

ఉసిరి

ఉసిరి ఎన్నో ఔషదగుణాలున్న కాయ. ఇది  మూడు దోషాలను సమన్వయం చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఉసిరిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. 

 

click me!

Recommended Stories