మిగిలిపోయిన అన్నాన్ని సరిగ్గా ఎలా నిల్వ చేయాలి?
అన్నం 40 డిగ్రీల నుంచి 140 డిగ్రీల ఫారెన్ హీట్ (4 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్) మధ్య ఉష్ణోగ్రతలో రెండు గంటలకు మించి ఉంటే బ్యాక్టీరియా చాలా త్వరగా పెరుగుతుంది. అందుకే మీరు అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకు మించి పెట్టకూడదు. గది ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ఒక గంట కంటే ఎక్కువ పెట్టకూడదు. మిగిలిపోయిన అనాన్ని ఫుడ్ పాయిజనింగ్ కలిగించే బ్యాక్టీరియా నుంచి రక్షించడానికి అన్నం వేడిగా లేనప్పుడు రిఫ్రిజిరేటర్ లో కంటైనర్ లో పెట్టండి. మిగిలిపోయిన అన్నాన్ని చల్లార్చి 40 డిగ్రీల ఫారెన్ హీట్ (4 డిగ్రీల సెల్సియస్) కంటే తక్కువగా ఉంచిన రిఫ్రిజిరేటర్ లో భద్రపరిస్తే నాలుగు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.