ఉదయమా? సాయంత్రమా? గ్రీన్ టీ ని ఎప్పుడు తాగాలి.. ఎప్పుడు తాగకూడదు?

First Published | Dec 9, 2023, 7:15 AM IST

పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే కదా.. ప్రస్తుత కాలంలో చాలా మంది గ్రీన్ టీని తాగడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి గ్రీన్ టీ బరువును తగ్గించడం నుంచి  ఒత్తడి నుంచి ఉపశమనం కలిగించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇదంతా బానే ఉన్నా.. గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి? ఎప్పుడు తాగకూడదో తెలుసా? 
 

ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు రోజును వేడివేడి కాఫీ, లేదా టీ తోనో స్టార్ట్ చేస్తారు. వీటిలో టీ ఎప్పుడూ ముందుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది టీ ప్లేస్ లో గ్రీన్ టీని తాగడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కారణం గ్రీన్ టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది కాబట్టి. గ్రీన్ టీ మన బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. మెటబాలిజాన్ని పెంచడంతో పాటుగా ఎంతో మేలు చేస్తుంది. అయినా అసలు గ్రీన్ టీని ఏ పూట తాగాలి? ఎప్పుడు తాగకూడదు? అన్న ముచ్చట ఎంతమందికి తెలుసు? 
 

గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం

మనలో చాలా మంది ఉదయాన్నే గ్రీన్ టీని తాగుతుంటారు. కప్పు వేడి వేడి గ్రీన్ టీ తాగడానికి దీనికంటే మంచి సమయం ఇంకేముందని చాలా మంది భావిస్తారు. నిజమేంటంటే? గ్రీన్ టీ తాగడానికి ఇది బెస్ట్ టైం అయితే కాదు. ఆయుర్వేదం ప్రకారం.. ఉదయాన్నే గ్రీన్ ని తాగకూడదు. అలాగే మీ బ్రేక్ ఫాస్ట్ లో తాగకూడదు. 
 

Latest Videos


మీరు గ్రీన్ టీని తాగాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత గంట తర్వాత లేదా భోజనం చేసిన గంట తర్వాతనే తాగాలి. దీనివల్ల మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. పాలు, పంచదార కలిపిన టీ, కాఫీలల్లో లాగే గ్రీన్ టీలో కూడా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. వ్యాయామం, వాకింగ్ చేయడానికి అరగంట ముందు గ్రీన్ టీని తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. 


గ్రీన్ టీ ని ఎప్పుడు తాగకూడదు? 

నిద్రకు ముందు

ఇతర టీల మాదిరిగానే గ్రీన్ టీని కూడా నిద్రపోవడానికి ముందు అస్సలు తాగకూడదు. ముఖ్యంగా మీరు నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. ఎందుకంటే గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. ఇది మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. అంటే ఇది మెలటోనిన్ ను విడుదలను నిరోధిస్తుంది. దీంతో మీకు నిద్రపట్టదు. 
 

green tea

ఉదయాన్నే 

పరిగడుపున గ్రీన్ టీని తాగకూడదు. చాలా మంది జీవక్రియ ప్రారంభమవుతుందని ఉదయాన్నే గ్రీన్ టీని తాగుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మీకు కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. 
 

Image: Freepik

మందులు తీసుకున్న తర్వాత

చాలా మంది ట్యాబ్లెట్లను గ్రీన్ టీతో పాటుగా వేసుకుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే మాత్రలు వేసుకున్న వెంటనే లేదా దానితో పాటుగా తీసుకోవడం ప్రమాదకరం.  మందుల్లో ఉండే రసాయనాలు గ్రీన్ టీతో స్పందించి ఎసిడిటీని కలిగిస్తాయి. అందుకే మాత్రలను ఎప్పుడూ కూడా సాదా నీటితోనే వేసుకోవాలి. 
 

green tea

భోజనం తర్వాత

గ్రీన్ టీని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ దీన్ని ఎట్టిపరిస్థితిలో భోజనంతో లేదా భోజనం అయిన వెంటనే తాగకూడదు. ఎందుకంటే ఇది ఆహారం నుంచి పోషకాల శోషణను తగ్గిస్తుంది. దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది. గ్రీన్ టీని భోజనం అయిన గంట తర్వాతే తాగండి.

click me!