సూర్యనమస్కారం చేసే అలవాటుందా? ఇదెన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా?

First Published | Oct 24, 2023, 11:28 AM IST

ప్రస్తుతం జనాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త రోగాల రాకతో జనాలకు ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో రోజూ కేవలం ఒక పది నిమిషాల పాటు సూర్య నమస్కారం చేస్తే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. 

మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే జస్ట్ ఒక గంటను కూడా మన కోసం కేటాయించలేనంతగా. దీనివల్లే లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. రోజంతా ఒకేదగ్గర కూర్చొని పనిచేయడం వల్ల వల్ల శారీరక సమస్యలే కావు మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. 
 


శరీర భంగిమ

సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీర భంగిమ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది మన కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యనమస్కారాల వల్ల మెడనొప్పి,  వెన్నెముక నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు దీన్ని రెగ్యులర్ గా చేయడం వల్ల వెన్నెముక అమరిక కూడా మెరుగ్గా ఉంటుంది. సూర్యనమస్కారంతో శరీర భంగిమ చక్కగా ఉంటుంది. అంతేకాదు శరీరం కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంతేకాదు కండరాలు కూడా బలంగా ఉంటాయి.
 



మానసిక ప్రశాంతత

గజిబిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి మానసిక ప్రశాంతత కరువైంది. దీనితో స్ట్రెస్, యాంగ్జైటీ వంటి సమస్యలను ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు. అయితే ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు సూర్యనమస్కారాలు నిద్రలేమి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇది కంటిచూపును కూడా పెంచుతుంది. 
 


గుండె ఆరోగ్యానికి మేలు 

ప్రస్తుతం గుండెజబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం గుండె ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సూర్య నమస్కారాలతో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మన గుండె కండరాలు బలంగా మరుతాయి. రక్తం పంపింగ్ కూడా మెరుగుపడుతుంది.
 

surya namaskar

బరువు తగ్గడానికి

సూర్య నమస్కారాలు కూడా మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సూర్య నమస్కారాలతో జీర్ణక్రియ, జీవక్రియలు పెరుగుతాయి. దీంతో కేలరీలు తొందరగా కరగడం మొదలవుతుంది. రోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల జీర్ణ సమస్యలే రావు. ఇవన్నీ మీరు ఆరోగ్యంగా, ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. 
 

ఊపిరితిత్తులకు మేలు 

సూర్య నమస్కారాలను చేసేటప్పుడు శ్వాసమీద ద్యాస పెట్టాలి. ముఖ్యంగా ప్రతి భంగిమలో శ్వాసను లోతుగా తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బలంగా ఉంటాయి. అంతేకాదు ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. 
 

Latest Videos

click me!