ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ చేయడం అనేది చాలా అవసరం ఇది శరీరంలోని ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మనం అల్పాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం బాగోవాలంటే ఉదయం ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని డెటిషియన్స్ చెప్తున్నారు.
ఎటువంటి మధుమేహ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోవాలి. ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేయడం కాస్త ఆలస్యం అయినప్పుడు డ్రై ఫ్రూట్స్, గింజలు, పండ్లు వంటివి తీసుకొని గ్రీన్ టీ తాగినా కూడా శరీరానికి మేలు జరుగుతుంది.
కానీ బ్రేక్ ఫాస్ట్ మానేసి కాఫీలు టీలు తీసుకోవడం వల్ల ఒంట్లో కెఫీన్ స్థాయి పెరిగిపోతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది దీంతో డిహైడ్రేషన్ వస్తుంది. అయితే చక్కనైన ఆరోగ్యం కోసం అల్పాహారంగా ఏది పడితే అది తినకూడదు.
పాలు పండ్లు ముడి ధాన్యాలు వంటివి తీసుకోవడం ద్వారా ఉదయాన్నే తగినన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. అల్పాహారం మానేస్తే శరీరానికి పోషకాల కొరత పెరుగుతుంది. అలాగే రోజంతా ఆకలి ఎక్కువగా పెరిగి అధిక కొవ్వు చక్కెర కలిగిన ఆహారాలను తినే అవకాశం ఉంది.
Thepla
ఉదయాన్నే పీచు ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వలన రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. అప్పుడు తక్కువ పరిమాణంలో తిన్నా సరిపోతుంది. ఉదయం తినే టిఫిన్ పేరుకు తగ్గట్టు అల్పం గానే ఉండాలి.
అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్లు ఉండేవి అల్పాహారంగా తీసుకుంటే శరీర బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేగాని బరువు తగ్గడం కోసం పొద్దున్న అల్పాహారాన్ని స్కిప్ చేస్తే బరువు తగ్గటం సంగతి పక్కన పెడితే కొత్త రోగాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము.