Health Tips: షుగర్ పేషెంట్లకి కొబ్బరి నీళ్లు మంచివేనా.. డాక్టర్లు ఏమంటున్నారు!

First Published | Oct 24, 2023, 11:24 AM IST

HealthTips : సాధారణంగా కొబ్బరినీరు అందరికీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే షుగర్ పేషంట్లకి ఈ కొబ్బరినీరు త్రాగటం అనేది ఆరోగ్యానికి మంచిదేనా అనేది చాలామందికి అనుమానం. అయితే షుగర్ పేషెంట్లు కొబ్బరినీరు తాగవచ్చా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
 

 తాజా కొబ్బరి నీరు తాగడం అనేది ఒంటికి ఎంతో మంచిది ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా కొబ్బరినీటిలో ఉంటాయి. మీ శరీరం నిర్జలీకరణాన్ని నిరోధించడానికి ఈ కొబ్బరి నీరు ఎంతో ఉపయోగం. షుగర్ పేషెంట్లకి కొబ్బరినీళ్లు మంచిదా..

 రక్తంలో చక్కెర పెరిగే కొద్దిపాటి అవకాశాలని పరిగణలోకి తీసుకుంటే మధుమేహరోగులు వారు తినే మరియు త్రాగే వాటి గురించి ఆందోళన చెందుతారు కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగాలా వద్దా.. అనే విషయాలని ఈ కథనంలో తెలుసుకుందాం.


రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా కార్బోహైడ్రేట్లను వేగంగా గ్లూకోస్ గా మారుస్తుంది కాబట్టి తక్కువ G1 ఉన్న ఏదైనా మధుమేహానికి మంచిది. తక్కువ G1 అంటే 55. కొబ్బరినీళ్ళ గ్లైసిమిక్ సూచిక 54. అంటే ఇది తక్కువG1 ని కలిగి ఉంటుంది. కాబట్టి నిరభ్యంతరంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరినీళ్లు తాగవచ్చును.

మధుమేహరోగులకు ఫైబర్ మరియు ప్రోటీన్ రెండు ముఖ్యమైన పోషకాలు. కొబ్బరినీళ్ళల్లో ఈ రెండు ఎక్కువగా ఉంటాయి ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుంది. తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సహాయపడుతుంది.

 అయితే షుగర్ పేషెంట్లు ఈ కొబ్బరి నీటిని పొద్దున్న పూట తాగడం ఉత్తమమైన సమయం. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో లారీకి యాసిడ్ ఉంటుంది ఇది జీవక్రియను ప్రారంభించి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉండేలాగా చూస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది.
 

ఒక రోజుకి ఒక గ్లాస్ కొబ్బరి నీరు మాత్రమే తీసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి గర్భధారణ సమయంలో కూడా మధుమేహం సంభవిస్తూ ఉంటుంది. అలాంటివారు కూడా కొబ్బరినీరుని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అయితే పైన చెప్పినట్టు మోతాదులో రోజుకి ఒక గ్లాసు మాత్రమే తీసుకోవటం ఉత్తమం.

Latest Videos

click me!