కేలరీలు
బిస్కెట్లు మైదా, చక్కెరతోనే తయారవుతాయి. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. వీటిని తింటే బరువు పెరుగుతారు. అలాగే మీ శరీరంలోకి అదనపు కేలరీలు చేరుతాయి.ఈ బిస్కట్లు మీ ఆకలిని తీర్చవు.
ముఖ్యంగా మరింత ఎక్కువ తినాలనిపించేలా చేస్తాయి. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరగడమే కాదు.. దానికి సంబంధించిన ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు నూనెలు
మనం తినే చాలా రకాల బిస్కట్లలో ట్రాన్స్ ఫ్యాట్స్, హైడ్రోజనేటెడ్ నూనెలుంటాయి. ఇవి మన గుండెను ప్రమాదంలో పడేస్తాయి. ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి.
దీంతో మనకు గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. చెడు కొలెస్ట్రాల్ ఉన్న బిస్కట్లను తక్కువగా తిన్నా.. ఎక్కువగా తింటే మాత్రం గుండె జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.