చేపలు
చేపల కూరను కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదు. చాలా మంది చేపల కూరను చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఒకేసారి చాలా మొత్తంలో వండేసి తర్వాతి పూటకు వేడి చేసి తింటుంటారు. కానీ చేపల కూరను వేడి చేసి అస్సలు తినకూడదు.
చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. చేపలను తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. కానీ చేపల కూరను మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో ఉండే పోషకాలు లేకుండా పోతాయి. అలాగే ఈ కూర మీ శరీరానికి హాని చేస్తుంది. అందుకే చేపల కూరను చేసినప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయకుండా ఉండండి.
వైట్ బ్రెడ్
వైట్ బ్రెడ్ ను మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఈ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వీటిని వేడి చేస్తే వాటిలో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కు కారణమవుతుంది.
వంట నూనె
వంటనూనెను అస్సలు మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. ఒక్కసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. కానీ చాలా మంది డీప్ ఫ్రై చేసిన నూనెను తిరిగి కూరలకు, ఇతర వంటకు ఉపయోగిస్తుంటారు. కానీ నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఇవి మనకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ను పెంచుతాయి.