సాధారణంగా షుగర్ పేషెంట్లకు ఆహారం విషయంలో చాలా కన్ప్యూజన్ ఉంటుంది. ఏం తినాలి? ఏం తినకూడదు ? ఏ టైంలో తినాలి అనే డౌట్లు చాలా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బిజీ బిజీ పనులు, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది సమయానికి భోజనం చేయరు. కొందరైతే తరచూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. షుగర్ పేషెంట్లు అయితే ఈ తప్పు అస్సలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే హెల్తీ లైఫ్ కి బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం.
డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తినాలి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. సమతుల్య బ్రేక్ ఫాస్ట్ శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తిని అందిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, బరువు పెరగకుండా సహాయపడుతుంది.
25
షుగర్ పేషెంట్లు నేరుగా లంచ్ కి వెళ్లొద్దు
షుగర్ పేషెంట్లు ఉదయాన్నే ఆహారం స్కిప్ చేసి.. ఆ తర్వాత భోజనం చేస్తే ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి సమయానుసారం ఆహారం తీసుకోవడం ముఖ్యం. సాధారణంగా షుగర్ పేషెంట్లు తక్కువ తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు.
35
నరాలు, కంటి చూపుపై ప్రభావం
డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. గుండె జబ్బులు, నరాలు దెబ్బతినడం, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
45
ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే?
రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు అధికంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వీటిని మానేయడం వల్ల జీవక్రియ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల మానసికంగానూ ఇబ్బందులు ఎదురవుతాయి. చక్కెర స్థాయిలు మూడ్ స్వింగ్స్, చిరాకుకు కారణమవుతాయి.
55
షుగర్ పేషెంట్లు ఇవి తింటే మంచిది
రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా..
- తృణధాన్యాలు, ఓట్స్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి.