మాంసాహారంలోనే కాదు పప్పుల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే శాకాహారులు ప్రోటీన్ ను పొందడానికి పప్పులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది పప్పును రోజూ తింటుంటారు. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి.