డయాబెటీస్ పేషెంట్లకు ఈ డ్రింక్స్ విషంతో సమానం.. వీటికి దూరంగా ఉండలేదో..!

First Published | Sep 10, 2023, 1:06 PM IST

డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 
 

భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇదొక సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. ఈ వ్యాధి బారిన పడితే మందులను ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే జీవితాంతం దీన్ని అదుపులో ఉంచడాలి. డయాబెటీస్ అంటే మీ క్లోమం తగినంత ఇన్సులిన్ ను తయారుచేయలేని పరిస్థితి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటీస్ పేషెంట్లు మంచి జీవనశైలిని పాటించాలి. అలాగే కేలరీలను ఎక్కువగా తీసుకోకూడదు. కేలరీలను  ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమలో తక్కువగా పాల్గొనడం, చెడు ఆహారాలను తినడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

అయితే మంచి ఆహారాలను తీసుకుంటూ.. మంచి అలవాట్లను పాటించడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి జ్యూస్ లను తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


పండ్ల రసం

నిజానికి పండ్ల రసాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మధుమేహులకు ఇవి మంచివి కాకపోవచ్చు. ముఖ్యంగా వీటిలో చక్కెర వేయకున్నా సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా పండ్లతో రసం తయారుచేయడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ పోతుంది. ఇలాంటి పండ్ల రసాలను తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

international-tea-day

చక్కెర టీ

షుగర్ టీ కూడా మధుమేహులకు అస్సలు మంచిది కాదు.  ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు చక్కెర లేకుండా టీని తాగితేనే మంచిది.
 

డైట్ సోడా

డైట్ లేదా రెగ్యులర్ సోడాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. అందుకే మధుమేహులు ఇలాంటి వాటిని తాగకపోవడమే మంచిది. 
 

കാപ്പി

ఫ్లేవర్డ్ కాఫీ

ఫ్లేవర్డ్ కాఫీ కూడా మధుమేహుల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీకు మధుమేహం ఉంటే చక్కెర లేని కాఫీని ఇంట్లోనే తయారుచేసుకుని తాగడం మంచిది. 

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్ ను రోజూ తాగేవారున్నారు. కానీ ఇవి ఇతరులకే కాదు మధుమేహులకు కూడా అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో పిండిపదార్థాలు, కెఫిన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అలాగే ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తాయి. అందుకే మీకు డయాబెటీస్ ఉండే ఎనర్జీ డ్రింక్స్ ను అస్సలు తాగకండి.
 

ఆల్కహాల్

మధుమేహులు ఆల్కహాల్ ను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే మధుమేహులు ఆల్కహాల్ ను తాగడం వల్ల కొన్ని గంటల్లోనే రకత్ంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ముఖ్యంగా  డయాబెటీస్ కంట్రోల్ లో ఉండటానికి మందులను తీసుకుంటున్నప్పుడు ఆల్కహాల్ ను అసలే తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!