చక్కెర కంటే బెల్లమే బెటర్.. అని ఎందుకంటారో తెలుసా?

First Published | Aug 30, 2024, 2:40 PM IST

ప్రతిరోజూ మనం చక్కెరను ఉపయోగిస్తుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే మీరు చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించొచ్చు. నిజానికి చక్కెర కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిది. ఎలాగంటే? 

jaggery

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఎన్నో ఆహారాలను తినాలి. ఉప్పు లాగే మన శరీరానికి చక్కెర కూడా అవసరం.నిజానికి చక్కెర కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కెర మన శరీరానికి శక్తినందిస్తుంది. చక్కెరతో  మన రోజువారీ పనులను చేసుకోవడానికి తగిన శక్తి అందుతుంది. కానీ మోతాదుకు మించి తింటే చక్కెర ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తుంది. అందుకే చక్కెరను తినకూడదని చెప్తుంటారు. 

sugar


కానీ చాలా మంది స్వీట్లను చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ స్వీట్లలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  ఈ చక్కెర మీ బరువును పెంచడంతో పాటుగా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే మీరు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. అలాగని బెల్లాన్ని కూడా ఎక్కువగా తినకూడదు. దీన్ని కూడా లిమిట్ లోనే తినాలి. అయితే చక్కెర లాగా బెల్లం ప్రాసెస్ చేయబడదు. అందుకే బెల్లం చక్కెర కంటే మంచిదని అంటుంటారు. అసలు చక్కెర కంటే బెల్లం మనకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


jaggery


బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పోషకాలు సమృద్ధిగా.. 

బెల్లంలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఐరన్ మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. బెల్లంలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. కానీ మీరు చక్కెరను తింటే ఇవి అందవు. బెల్లంలో ఉండే ఈ పోషకాలు ఎముకలు, రక్తం, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
 

తక్కువ ప్రాసెస్ చేయబడింది

చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లాన్ని తయారుచేస్తారు. దీనికి చాలా తక్కువ ప్రాసెసింగ్ అవసరం. కానీ చక్కెర అలా కాదు. చక్కెర ప్రాసెసింగ్ లో ఎన్నో రసాయన ప్రక్రియలకు లోనవుతుంది. దీంతో చక్కెరలో ఉండే పోషకాలు తగ్గుతాయి. అందుకే చక్కెర కంటే బెల్లమే చాలా మంచిదని చెప్తారు.
 

జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది

బెల్లంలో ఎన్నో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. వీటితో పాటుగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
 


రక్తంలో చక్కెర,  శక్తి

చక్కెరతో పోలిస్తే బెల్లాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది సాధారణ శక్తిని అందిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా హెచ్చుతగ్గులను తగ్గిస్తుంది. అలాగే చక్కెర తినడం వల్ల వెంటనే ఎనర్జీ వస్తుంది. కానీ దీని తర్వాత తొందరగా అలసటకు గురవుతారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు వీలైనంత దూరంగా ఉండాలి. 

jaggery 1.j

నెలసరి నొప్పిని తగ్గిస్తుంది

అవును బెల్లంతో మీరు నెలసరి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. దీనిలో ఫోలెట్, ఐరన్ లు మెండుగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో నెలసరి తిమ్మిరి, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతాయి. 

బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది

చక్కెరను తింటే బరువు పెరుగుతారన్న నిజం. కానీ మీరు బెల్లాన్ని తింటే ఈ సమస్యే ఉండదు. నిజానికి బెల్లం మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెల్లాన్ని తింటే తీపి కోరికలు తగ్గుతాయి. అలాగే మీరు కేలరీలను తీసుకోవడం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే చక్కెరకు బదులుగా బెల్లాన్నే తినండి. బెల్లం మీ చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 

click me!