Health Tips: ఈ రోగాలు నయం అవ్వాలా.. అయితే వర్షపు నీటితో స్నానం చేయాల్సిందే?

First Published | Aug 21, 2023, 10:54 AM IST

Health Tips: వర్షం పడినప్పుడు చిన్న పిల్లలు అందులో ఆడుతుంటే మనం మందలిస్తాం. జ్వరం వస్తుంది అంటూ ఏవేవో చెప్తాం. కానీ వర్షపు నీటితో స్నానం చేయడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు అవేంటో ఇప్పుడు చూద్దాం.
 

వర్షంలో తడిస్తే జలుబు, దగ్గు వస్తుందని.. జుట్టు రాలిపోతుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ నిజానికి వర్షంలో స్నానం చేయడం వలన చాలా అనారోగ్య సమస్యలు నయమవుతాయి. వర్షపు నీరు చెమటకాయల నుంచి దద్దుర్ల వరకు ప్రతిదీ నయం చేస్తుంది.

ఎర్త్ స్కేప్ ప్రకారం ఇది పంపు నీటి కంటే మెరుగైనది కాబట్టి ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ నీటిలో క్లోరిన్, ఫ్లోరైడ్ వంటి ఇతర రసాయనాలు ఏవి ఉండని ఒక స్వచ్ఛమైన జలం. అందుకే ఈ జలం మానవ శరీరానికి చాలా ప్రయోజనకరమైన అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది.
 

Latest Videos


 ఇందులో ఆల్కలిన్ పిఎఫ్ ఉంటుంది. ఇది జుట్టుకి చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో హెవీ మెటల్స్ లేకుండా ఉండటం వలన జుట్టు పొడవుగా పెరగడానికి, అలాగే స్కాల్ప్ లోని మురికితో పాటు డల్ నెస్  కూడా తగ్గించి జుట్టుని మెరిసేలా చేయటానికి ఉపయోగపడుతుంది.
 

వాన నీటిలో స్నానం చేస్తే శరీరంలోని ఎండార్ఫిన్, సెరోటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు అన్ని రకాల ఒత్తిడులను విడుదల చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరచడానికి పనిచేస్తాయి. అలాగే వర్షంలో స్నానం చేసిన తర్వాత నిద్ర చాలా మంచిది. దాని వలన శరీరము, మనసు రెండు విశ్రాంతి తీసుకుంటాయి.

 ఇది హార్మోన్ల అసమతుల్యతను  కాపాడుకోవడంలో కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అలాగే వర్షపు నీరు చర్మానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇది చర్మం యొక్క సహజ పీహెచ్ ని పెంచుతుంది. వర్షపు నీరు వల్ల చర్మం తేమను పొందుతుంది.
 

 వర్షంలో ప్రత్యేకమైన సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి బీ12 విటమిన్ ని ఉత్పత్తి చేస్తాయి. అలా అని ఆస్తమానం వర్షం నీటిలో తడవటం చేయకండి. రోజుకి రెండుసార్లు కంటే ఎక్కువ వర్షంలో స్నానం చేస్తే అది మళ్ళీ అనారోగ్యానికి దారితీస్తుంది.

click me!