సాధారణంగా వర్షాకాలం రాగానే వెంటనే వచ్చే సమస్య జలుబు, దగ్గు. అందుకే వేడినీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగటం వలన రాగనిరోధక శక్తి పెరుగుతుంది. కోల్డ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవచ్చు.
అలాగే వేడి పాలలో కొంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. యాంటీబయోటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి.
అలాగే జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగటం వల్ల మంచి ఒక ఉపశమనం లభిస్తుంది. అల్లం లోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గు ని తగ్గిస్తుంది. లేదంటే వేడి నీటిలో నిమ్మరసం, తేనే కలిపి చివరిగా కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి ఆ హెర్బల్ టీ తాగినా కూడా గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పి ప్రారంభమవుతుంది అనిపిస్తున్నప్పుడు మిరియాలతో కాషాయం చేసుకొని తాగిన.. లేదంటే పాలలో మిరియాల పొడి కలుపుకొని తాగిన మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులను నిమ్మ తేనెను చేర్చాలి.
జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పెరుగు, తృణధాన్యాలని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అలాగే ముక్కు దిబ్బడగా అనిపించినప్పుడు ఎక్కువగా ఆవిరి పెట్టడం చేస్తూ ఉండండి. రోజంతా గోరువెచ్చని నీరు మాత్రమే తాగండి.
గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి పుకలించి ఉమ్మి వేయండి. ఇలా చేయటం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆహారంలో ఎక్కువగా వెల్లుల్లి ఉపయోగించండి. వెల్లుల్లి జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే పుదీనా కూడా ఎక్కువగా ఉపయోగించండి. ఇది సహజమైన డీ కాంగెస్టెంట్ కాబట్టి జలుబు, ఫ్లూ తో పోరాడటానికి సహాయపడుతుంది.