బొప్పాయిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది తీయగా, టేస్టీగా ఉంటుందని. నిజానికి బొప్పాయిలో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.