నానబెట్టిన ఖర్జూరాలను తింటే కిడ్నీలకు కలిగే ప్రయోజనాలు ఇవే!

First Published Jan 28, 2022, 3:22 PM IST

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (Kidneys) ప్రధానమైనది. కిడ్నీల పనితీరు మందగిస్తే అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలను అలవరచుకుంటే కిడ్నీల పనితీరు మెరుగుపడి ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..   
 

మంచినీరు: మానవ శరీరంలో అనేక రోగాలు రావడానికి ముఖ్య కారణం నీటిని తక్కువగా తాగడం. కనుక కిడ్నీల పనితీరు మెరుగు పడాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు (Water) తాగమని వైద్యులు చెబుతారు. శరీరంలో తయారయ్యే టాక్సిన్లను (Toxins) కిడ్నీలు బయటకు పంపాలంటే నీరు పుష్కలంగా తాగాలి.
 

ఖర్జూరాలు: ఖర్జూరాలలో (Dates) ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. కనుక ఖర్జూరాలను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు తింటే కిడ్నీలో రాళ్లు (Kidney stones) వంటి సమస్యలు దూరమవుతాయి.
 

నిమ్మరసం, తేనె: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం (Lemon juice), తేనె (Honey) కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిన్ సిట్రేట్ స్థాయిలను పెంచి కిడ్నీలోని రాళ్లను కరిగిస్తుంది. కనుక నిమ్మరసంలో తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగి పోయి కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
 

యాపిల్: యాపిల్ (Apple) లో ఉండే ఔషధ గుణాలు కిడ్నీల లోపల బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి. యాపిల్ పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు కిడ్నీలోని ఇన్ఫెక్షన్లను నయం చేసి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. కనుక రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
 

విటమిన్ సి: కిడ్నీలో రాళ్లను కరిగించే సామర్ధ్యాన్ని విటమిన్ సి (Vitamin C) కలిగి ఉంటుంది. ఈ పోషకం కిడ్నీ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కనుక విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లులతోపాటు (Citrus fruits) బ్రోకలీ, దోసకాయ వంటి కూరగాయలను తీసుకోవడం మంచిది.
 

బార్లీ: బార్లీలో (Barley) అధిక మొత్తంలో ఫైబర్ (Fiber) ఉంటుంది. ఇది కిడ్నీలను శుభ్రపరిచడానికి సహాయపడుతుంది. దీంతో కిడ్నీలు ప్రమాద బారిన పడకుండా ఉంటాయి. కనుక రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బార్లీ గింజల నీటిని ఉదయాన్నే తాగితే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
 

రాజ్మా: రాజ్మాను (Rajma) కిడ్నీ బీన్స్ (Kidney beans) అని కూడా పిలుస్తారు. ఇవి కిడ్నీ ఆకారాన్ని పోలి ఉంటాయి. రాజ్మాలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.
 

బెర్రీస్: పొటాషియం (Potassium) పుష్కలంగా ఉండే ద్రాక్ష, కమలాఫలం, అరటిపండు, కివి, ఆఫ్రికాట్ వంటి వివిధ రకాల బెర్రీస్ (Berries) లను తీసుకుంటే కిడ్నీలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. వీటితో పాటు కిడ్నీలకు హానికలిగించే ఆహారపదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.

click me!