ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 03, 2021, 06:50 PM IST

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లా (Amla), ధాత్రిఫలం (Dhatrifalam) అని పిలుస్తారు. ఉసిరి ఒక ఔషధ గని. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పోషకాలు ఉన్నాయి. ఉసిరి చెట్టు లో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్నా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఉసిరి కాయని  తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..  

PREV
16
ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

ఉసిరిలో (Amla) ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని  సర్వదోషహర అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది.
 

26
amla

ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే చేయవానప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేసాక తీసుకుంటే జీర్ణక్రియను (Digestion) పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం (Constipation) సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది.

36

శరీర కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటిమైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను (Blood circulation) మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం (Diabetes) నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ.

46
amla

తరుచూ వేదించే దగ్గు నుంచి ఉపశమనం ఉండడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని  నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా (Asthma), టీవీ, ధీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను (Throat infections) తగ్గించుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.

56

మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపకశక్తిని (Memory) పెంచుతుంది. రోజు ఉసిరి కాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి.  చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.
 

66

కంటి చూపును (Eye sight) మెరుగు పరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరి లో క్యాల్షియం (Calcium) అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను  ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి.

click me!

Recommended Stories