పరిగడుపున టమాటా రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

Published : Jul 16, 2023, 07:15 AM IST

టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్,  లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మననల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

PREV
16
పరిగడుపున టమాటా రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
tomato juice

టమాటాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న హెల్తీ కూరగాయ. టమాటాల్లో వాటర్ కంటెంట్ 95 శాతం ఉంటుంది. అలాగే టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్,  లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. పోషకాల బాంఢాగారమైన టమాటా జ్యూస్ ను ఉదయం పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

టమాటాల్లో విటమిన్ సి  తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున టమాటా జ్యూస్ ను తాాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పు తగ్గుతుంది. 
 

36

అధిక రక్తపోటు 

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతుంది. అయితే పొటాషియం ఎక్కువగా ఉండే టమోటా జ్యూస్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. 

46

మలబద్దకం

ఉదయాన్నే పరగడుపున టమాటా జ్యూస్ ను తాగితే మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టమాటా రసంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఉదయం పరిగడుపున తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. 

56

చెడు కొలెస్ట్రాల్

టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

66
tomato juice

డయాబెటీస్ నియంత్రణ

ఒక కప్పు చిన్న టమోటాలో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా టమోటో జ్యూస్ తాగొచ్చు. ఈ టమాటా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ ను తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories